Site icon HashtagU Telugu

తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలవలేదట

Piyush Goel

Piyush Goel

తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామని,తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందన్నారు.అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ రైస్ ను కొనేందుకు అంగీకరించామని మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద ఇప్పటికే 4 ఏళ్ల నిల్వలు ఉన్నాయన్నారు.ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపించారు.శనివారం నుంచి ఎదురుచూస్తున్నట్టుగా తెలంగాణ మంత్రులు,ఎంపీలు చెపుతున్నారని, తాను వాళ్ళను ఆహ్వానించలేదని గోయల్ తెలిపారు.తెలంగాణ మంత్రులు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని, సరఫరా చేస్తామన్న బియ్యమే ఇంతవరకు ఇవ్వలేదని గోయల్ విమర్శించారు. బియ్యం సరఫరా చేసే విషయంలో ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు సార్లు వాయిదా కోరిందని,బియ్యం తరలింపుకు రైల్వే వాగన్లు ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చేసుకున్న ఒప్పందం ప్రక్రారం తెలంగాణ ప్రభుత్వం బియ్యం సరఫరా చెయ్యాలని కేంద్ర మంత్రి కోరారు.