Revanth Reddy Secret Meeting with CBN : చంద్రబాబు తో రేవంత్ భేటీ..?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో భేటీ అయ్యారా..?

Published By: HashtagU Telugu Desk
Revanth Babu Meet

Revanth Babu Meet

Revanth Reddy Secret Meeting with CBN..? : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో భేటీ అయ్యారా..? ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ దాదాపు 52 రోజులు జైల్లో గడిపిన చంద్రబాబు.. ఇటీవల మధ్యంతర బెయిల్ ఫై బయటకు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో రిస్ట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు , సినీ స్టార్స్ తదితరులు ఆయన్ను కలుస్తూ.. ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. బాబును కలవడం జరిగింది. ఇదిలా ఉంటె సోమవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. చంద్రబాబు ను కలిసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

We’re Now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల హోరు మాములుగా లేదన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ (BRS) మరోసారి అధికారం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికలను చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్‌ (Congress) కూడా అధికారం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కేసీఆర్‌ (CM KCR) ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. 2018 ఎన్నికల్లో టీడీపీ (TDP)తో పొత్తు పెట్టుకుని నష్టపోయింది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా పరోక్షంగా టీడీపీ మద్దతును కూడగట్టింది. కాంగ్రెస్‌ కోసమే తెలంగాణ టీడీపీ (TTDP) పోటీలోంచి తప్పుకుందన్న ప్రచారం నడుస్తుంది. ఇక చంద్రబాబు (Chandrababu)కు శిష్యుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అంటే అమితమైన ప్రేమ. టీడీపీలో రేవంత్‌ రెడ్డి చాలా కాలం ఉండడమే కాదు చంద్రబాబు కు నీడలా వ్యవహరించారు. అంతే కాదు చంద్రబాబు కోసం రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసు (Note For Vote Case)లో అడ్డంగా దొరికారు కూడా!. ఆలా బాబు మాట జవదాటని రేవంత్‌ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాంటి ప్రియా శిశుడ్ని ఎలాగైనా సీఎం సీటులో కూర్చోబెట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో చంద్రబాబును అర్థరాత్రి వేళ రేవంత్‌ రెడ్డి రహస్యంగా కలుసుకున్నారని , ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారని, ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాబు చెప్పినవన్నీ రేవంత్ అమలు చేయబోతున్నాడని..అంతే కాదు రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి రావడంలో కూడా చంద్రబాబు పాత్ర ఉందని అంటున్నారు. మరి నిజంగా రేవంత్.. బాబును కలిశాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం రేవంత్ – బాబు భేటీ అయ్యారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలని బిఆర్ఎస్ క్యాష్ చేసుకుంటుందా..అనేది చూడాలి.

Read Also : Rahul – Priyanka Telangana Tour : ఈ నెల 17 న తెలంగాణ కు రాహుల్ రాక..వారం పాటు ప్రచారం

  Last Updated: 14 Nov 2023, 11:55 AM IST