జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక (Jubilee Hills Bypolls ) జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (BRS) టీడీపీ (TDP) మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత సామ రామమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్న సమయంలో, కేటీఆర్ టీడీపీ ప్రధాన నేత లోకేష్‌ను సంప్రదించడమంటే రాజకీయంగా లాభసాటిగా చూడవచ్చని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణల వెనుక ఎంత నిజముందో అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్ మద్దతు కోరే పార్టీగా వైసీపీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. జగన్‌ను అన్నగా చూస్తున్న కేటీఆర్, గతంలో ఆయన గెలుపుకోసం కృషి చేశారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలు, అరెస్టు సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాలు ఇలా అందరికి తెలిసినవే. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ లోకేష్‌ను కలవడం సాధ్యమే కాదు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే మాగంటి గోపీనాథ్ అంశం మాత్రం కొంత చర్చకు వచ్చింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ బీఆర్ఎస్‌లోకి చేరినా, ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం టీడీపీ పరంగా సాగింది. ఆయన కుటుంబంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సానుభూతి ఎంతో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలో ఉన్నప్పటికీ పరోక్షంగా టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు అదే మద్దతు కోసం కేటీఆర్ సంప్రదించిన అవకాశం కూడా ఉందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి టీడీపీ మద్దతు కోసం బిఆర్ఎస్ ఎదురుచూస్తుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది.