Revanth Reddy: పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా? కేసీఆర్ పై రేవంత్ ఫైర్!

ఇప్పటికే కొడంగల్ బరిలో కేసీఆర్ పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డిలో నామినేషన్ వేయబోతున్నారు.

  • Written By:
  • Updated On - November 10, 2023 / 05:31 PM IST

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి శుక్రవారం కామారెడ్డిలో పర్యటించారు. ఇప్పటికే కొడంగల్ బరిలో కేసీఆర్ పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నేడు నామినేషన్ (Revanth Reddy Nomination) దాఖలు చేసేందుకు కామారెడ్డికి చేరుకున్నారు. రేవంత్ రాకతో జనంతో కామారెడ్డి కిక్కిరిసిపోయింది. అయితే రేవంత్ రెడ్డికి నామినేషన్ కోసం కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ కు చెందిన గ్రామస్తులు విరాళంగా కొంత డబ్బును ఇచ్చారు.

కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డికి  గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని వారు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని పేర్కొన్నారు. పదేళ్లు గడిచినా పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రకటించినందు వల్లే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వేలకోట్లు సంపాదించారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి నేటి కోనాపూర్‌ తన తల్లిగారి స్వగ్రామం అంటూ వివరించారు. తన చిన్నతనంలో ఈ ప్రాం తంలో తన తల్లి, కుటుంబీలతో కలిసి తిరిగిన ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆరుగొండలో తన మేనమామలు ఉంటారని కేసీఆర్‌ చెప్పారు. వారి వద్దకు వచ్చి వెళ్లే క్రమంలో కామారెడ్డి పట్టణంలోనూ మా ర్వాడీ కుటుంబానికి చెందిన బాదల్‌ సింగ్‌ వారి ఇంట్లో నూ ఉండేదని చెప్పారు. అడ్తి నిమ్మల జీవన్‌ రెడ్డితోనూ తమ కుటుంబానికి స్నేహపూర్వక సంబంధం ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కోనాపూర్ గ్రామస్తులు రేవంత్ రెడ్డికి విరాళాలు అందించడం గమనార్హం.

Also Read: Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ “సత్యభామ” టీజర్ రిలీజ్