Kalvakuntla Kavitha: బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కవితకు ప్రయారిటీ కానీ, పార్టీ పదవులు కానీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆమె ఎదుట ఇప్పుడు రెండు ఆప్షన్లే ఉన్నాయి. మరో రాజకీయ పార్టీలో చేరడం, లేదంటే కొత్త రాజకీయ పార్టీని పెట్టుకోవడం అనే ఆప్షన్లనే కవిత ఎంచుకోవాల్సి ఉంది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కవిత ట్రై చేసినట్లు పలు పత్రికల్లో సంచలన కథనాలు ప్రచురితం అయ్యాయి. ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కవిత సంప్రదించారని తెలిసింది. గత రెండు, మూడు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ టైంలోనే కవిత ప్రతిపాదన సమాచారం కాంగ్రెస్ పెద్దలకు చేరిందట. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్‌లకు పలువురు కాంగ్రెస్ పెద్దలు చెప్పారట. ఈవిషయం విని వారు షాక్‌కు గురయ్యారట.
Also Read :Kavitha Padayatra : జూన్ 2న కవిత కీలక ప్రకటన.. పాదయాత్రకు ప్లాన్.. తెలంగాణ జాగృతిపై ఫోకస్
కవిత ప్రతిపాదన.. రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్ ఫీడ్‌బ్యాక్ ఇదీ
ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం మంచిది కాదని రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్‌లు తమ అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. ఈ టైంలో కవితను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే, కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెసే కారణమన్న తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్తాయని వారిద్దరూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. తమతో మాట్లాడకుండా, నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కవిత సంప్రదించడాన్ని సహించలేక వారు ఆ రకమైన ఫీడ్ బ్యాక్‌ను ఇచ్చి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సొంతంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్‌ల అభిప్రాయాలకే పరిమితం కాకుండా.. కాంగ్రెస్‌లోని మరికొందరు సీనియర్ నేతల ఫీడ్ బ్యాక్‌ను కూడా ఈవారంలో హైకమాండ్ పెద్దలు సేకరించే ఛాన్స్ ఉంది.
Also Read :Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు ఎవరో తెలుసా ?
కవితకు టాప్ ప్రయారిటీ దక్కే ఛాన్స్
తెలంగాణలో హస్తం పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్లాన్‌తో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈవిషయంలో ఆయన వెనకడుగు వేసే అవకాశమే లేదు. గతంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్, విజయశాంతి వచ్చినప్పుడు ఎలాగైతే ప్రయారిటీ ఇచ్చారో.. ఇప్పుడు కవిత(Kalvakuntla Kavitha) వచ్చి చేరినా అంతే ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే కవిత ఎంట్రీ ఇస్తారనే విషయమే కాంగ్రెస్‌లోని కొందరు నేతలకు మింగుడు పడటం లేదు. ఆమె రాకతో ప్రాభవాన్ని కోల్పోతామని కొందరు ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే కవితకు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే బీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో క్యాడర్ హస్తం పార్టీ వైపుగా క్యూ కట్టే అవకాశాలు ఉంటాయి. తెలంగాణకు దూరంగా ఉంటూ రాజకీయాలు నడుపుతున్న విజయశాంతికే, కాంగ్రెస్ పార్టీ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. తెలంగాణలోనే ఉంటూ ప్రజలతో మమేకం అయ్యే కవితకు కాంగ్రెస్‌లో టాప్ ప్రయారిటీ దక్కే అవకాశాలు ఉంటాయి. ఆమె చేరిక జరగడం ఒక్కటే ఆలస్యం.