Diabetic Retinopathy : డయాబెటిక్ రెటీనోపతి దడపుట్టిస్తోంది. తెలంగాణలోని కంటి ఆస్పత్రులకు వచ్చే చాలామందిలో డయాబెటిక్ రెటీనోపతి ప్రాబ్లమ్ బయటపడుతోంది. డయాబెటిక్ రెటీనోపతి సమస్య నిర్ధారణ అవుతున్న వారిలో దాదాపు 25 శాతం మంది వరకు డయాబెటిస్ రోగులే ఉన్నారు. షుగర్ సమస్యతో పాటు డయాబెటిక్ రెటీనోపతి వస్తే దీర్ఘకాలంలో కంటి రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. ఒక్కసారి కంటి రెటీనా దెబ్బతింటే దాన్ని సరిచేయడం సాధ్యం కాదు.
Also Read :Amaravati : రాజధాని అమరావతిలో ఇంటింటికి పైప్‌లైన్‌తో గ్యాస్
కనుగుడ్డు వెనుక రెటీనా(Diabetic Retinopathy) ఉంటుంది. రెటీనా అనేది సున్నితమైన పొర. ఇది కంట్లోకి వచ్చే కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. వాటిని దృశ్యనాడి గ్రహించి మెదడుకు చేరవేస్తుంది. మెదడు వాటిని దృశ్యాలుగా మార్చి చూపిస్తుంది. కంటి రెటీనాలో అతి సూక్ష్మమైన రక్తకేశ నాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగితే.. రెటీనాలోని రక్తకేశ నాళికలు దెబ్బతింటాయి. ఈ ప్రభావంతో రెటీనాలో వాపు, రక్తస్రావం జరుగుతుంది. డయాబెటిక్ రెటీనోపతి బాగా ముదిరితే.. అక్షరాలు వంకరగా కనిపిస్తాయి. దృష్టి లోపం క్రమంగా పెరుగుతుంది. ఫండస్ పరీక్షతో కంటి రెటీనా పొరను చూడటం ద్వారా వైద్యులు ఈ సమస్యను గుర్తిస్తారు. షుగర్‌తో బాధపడేవారు తరచూ కంటి పరీక్ష చేయించుకోవాలి. షుగర్‌ను కంట్రోల్ చేసుకుంటూనే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి.
Also Read :New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ
సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ 30 ఏళ్ల తర్వాత నిర్ధారణ అవుతుంది. జీవనశైలి మార్పులు, నోటి మందులు, ఇన్సులిన్‌తో దీన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ వల్ల ఏర్పడే ముఖ్యమైన సమస్యలలో ఒకటి డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో మూడింట ఒక వంతు మందికి ఈ ప్రాబ్లమ్ వస్తోంది. డయాబెటిక్ రెటినోపతి రోగులు మల్టీఫోకల్ ఇంట్రాకోక్యులర్ లెన్స్‌లు పెట్టుకోమని డాక్లర్లు సూచిస్తున్నారు. ఎందుకుంటే వారి కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సున్నితంగా మారుతుంది. డయాబెటిక్ రెటినోపతిని ఆలస్యంగా గుర్తిస్తే, శాశ్వత దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.