Site icon HashtagU Telugu

DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?

Dho Srinivas

Dho Srinivas

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా మీకేమైనా ప్రాబ్లమా అంటూ వ్యాఖ్యానించారు. సీఎం నాకు తండ్రి లాంటి వారు అందుకే ఆయన పాదాలను మొక్కాను అంటూ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి కేసీఆర్ వైద్య శాలను కేటాయించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు మరోబాపూజీ అన్నారు. ఇక్కడ కాలేజీ లేకపోవడం తో 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు తాను హైదరాబాద్ లోని ఓయూ వెళ్లాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్.

రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను గత మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ వేదికగా వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వాధికారులు హాజరయ్యారు. డీహెచ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. సీఎంకు పుష్పగుచ్చం అందించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత ఆయన పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీలో ఎన్నికల టికెట్ కోసమే ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే డీహెచ్ శ్రీనివాస్ రావు ఈ సంచలన కామెంట్స్ చేశారు.