Site icon HashtagU Telugu

Press Release : నూతన చట్టాలపై పోస్టర్లను విడుదల చేసిన DGP రవిగుప్త..

Dgp Ravigupta Released Post

Dgp Ravigupta Released Post

జులై ఒకటో తేదీ నుండి మూడు కొత్త క్రిమినల్ చట్టాలైన (New Criminal Laws) భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మరియు భారతీయ సాక్ష్యా అధినియం (Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagarik Suraksha Sanhita, and the Bharatiya Sakshya Adhiniyam) లకు సంధించిన పోస్టర్లను DGP రవిగుప్త (DGP Ravigupta) విడుదల చేసారు. ఇంగ్లీష్, తెలుగులో ఈ పోస్టర్లను ముద్రించడం జరిగింది. DGP కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోస్టర్లను ఆవిష్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కొత్త చట్టాల గురించి అవగాహన ప్రచారంలో భాగంగా.. ఈ పోస్టర్లు అన్ని పోలీసు స్టేషన్ల వద్ద ప్రదర్శించబడతాయనీ తెలిపారు. కొత్త చట్టాల గురించి పౌరులకు మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ప్రొసీజర్ పై సమగ్ర బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో 43 SOPలు మరియు 31 ప్రొఫార్మాలు ఉన్నాయనీ, కొత్త విధానపరమైన చట్టం, క్రింద చాలా ముఖ్యమైన విషయాలను కవర్ చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులు ఒకే రకమైన విధానాలను పాటించేందుకు స్పష్టత ఉంటుందన్నారు.

డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సహకారంతో సిఐడి ద్వారా ఎస్ ఓ పి లు అభివృద్ధి చేయబడ్డాయనీ డిజిపి అన్నారు. సిఐడి అడిషనల్ డిజిపి శ్రీమతి శిఖా గోయెల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీ మతి వైజయంతిలు కృషి చేశారని వారిని ఈ సందర్భంగా డిజిపి ప్రశంసించారు.

కొత్త చట్టాలపై దర్యాప్తు అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు సిఐడి విభాగంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కేంద్రం ఈరోజు ఉదయం 8గంటల నుండి పనిచేయడం ప్రారంభించిందనీ ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులందరూ శిక్షణ పొందారని డిజిపి తెలియజేశారు. టి జి పి ఏ డైరెక్టర్ శ్రీమతి అభిలాషా బిష్త్ శిక్షణా విభాగాన్ని అభినందించారు. సాంకేతిక విభాగం పర్యవేక్షించిన అడిషనల్ డీజీపీ శ్రీ వి.వి. శ్రీనివాసరావును కొనియాడారు. శ్రీ మహేష్ ఏం భగవత్, అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ ఇంచార్జ్ లీగల్, శ్రీ జి. సుధీర్ బాబు, ఐ జి పి మల్టీ జోన్ I & II, , శ్రీ ఏం.. రమేష్, ఐ జి పి శ్రీ గజరావు భూపాల్, డిఐజి మరియు ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also : Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు