Site icon HashtagU Telugu

Ganesh : ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ద‌ర్శించుకునేందుకు భారీగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు

Khairatabad

Khairatabad

ఖైర‌తాబాద్ మ‌హా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివ‌స్తున్నారు. నిన్న ఆదివారం కావ‌డంతో గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా ర‌ద్దీ ఏర్ప‌డింది. రద్దీ కారణంగా పిల్లలు, సీనియర్ సిటిజన్లతో సహా కొందరు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఖైరతాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. చాలా మంది దర్శనం కోసం వేచి ఉండగా.. సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉన్నవారు ఆ ప్రాంతాన్ని రద్దీగా మార్చారు. భారీ రద్దీతో క్యూ లైన్లు ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నాయో సందర్శకులకు తెలియ‌క గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. కొంత మంది భక్తులు విలువైన పర్సులు, సెల్ ఫోన్లు పోగా మరికొందరు చిన్నారులు కనిపించకుండా పోయారు. కొందరు వృద్ధులు స్పృహతప్పి పడిపోయారు.

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ట్యాంక్ బండ్, టెలిఫోన్ భవన్ నుంచి పోలీసులు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అనంత చతుర్దశిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28న సామూహిక నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో భ‌క్తుల రద్దీ ఎక్కువగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ మహా గణేష్ నగరంలో అతిపెద్ద విగ్ర‌హం.. దీనిని మ‌ట్టితో చేశారు. ఈ ప్రతిమ 63 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం అనేక మంది వీఐపీలు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మ‌హాగ‌ణ‌ప‌తిని సంద‌ర్శిస్తారు. ప్ర‌తి రోజు మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్దఎత్తున భ‌క్తులు త‌రలివ‌స్తున్నారు. నిమ‌జ్జ‌నం రోజు మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.