Site icon HashtagU Telugu

Telangana Jobs: నిరుద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ కు అందిన రిపోర్ట్ లో అసలేముంది?

6770 Telangana Secretariat Imresizer

6770 Telangana Secretariat Imresizer

నిరుద్యోగ సమస్య తెలంగాణ ప్రభుత్వాన్ని దాదాపు ఎనిమిదేళ్లుగా షేక్ చేస్తోంది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటన.. వారిలో ఆశలు పెంచింది. రాష్ట్రంలో అనధికారికంగా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. అంతెందుకు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల పద్దతిని ప్రవేశపెట్టాక.. 24 లక్షల మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే లెక్క ప్రకారం చూసినా 24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగుల సర్దుబాటు తరువాత జిల్లాల వారీగా ఏర్పడిన ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. దాంతోపాటు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంది. దీనికి అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవసరమైన రిపోర్ట్ ఇవ్వాలంటూ.. ఈ సంవత్సరం జనవరిలోనే ఓ కమిటీని ఏర్పాటుచేశారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్ శేషాద్రి ఛైర్మన్ గా మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది. వీరిలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తోపాటు మహిళాశిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ కసరత్తు చేసి ఓ రిపోర్ట్ ను తయారుచేసింది. దానికి మరో రెండు రిపోర్ట్ లు జత కలిశాయి. ఆ రెండింటినీ ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖలు అందించాయి. ఈ రిపోర్టులన్నీ సీఎం కేసీఆర్ దగ్గర ఉన్నాయి. శాఖల వారీగా ఉన్న వివరాలతోపాటు.. ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలను కూడా అందులో పొందుపరిచారు. మళ్లీ ఇందులో మరో క్లారిటీని కూడా ఇచ్చాయి ఆయా శాఖలు. ప్రమోషన్ల ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయి… డైరెక్ట్ గా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారో అన్న డీటైల్స్ కూడా ఉన్నాయి.

కమిటీ రిపోర్ట్ ను బట్టి చూస్తే.. పోలీసు, వైద్యారోగ్యం, విద్యా శాఖల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈమేరకే జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది. పైగా బీసీలకు ఉద్యోగ రిజర్వేషన్ల వయసును మరో పదేళ్ల కాలానికి పొడిగిస్తూ ఈమధ్యే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేతన సవరణ సంఘం ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి చూస్తే.. రాష్ట్రంలో 1,92,800 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక కొత్త జిల్లాల వారీగా వచ్చిన జోనల్ విధానం వల్ల ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలవుతాయి.

2021లోనూ ఉద్యోగాల భర్తీ సందడి చేసినా తరువాత చడీచప్పుడు లేదు. కాకపోతే అప్పుడు తక్కువ ఖాళీలున్నట్టుగా చూపారని టాక్. తరువాత మరో సందర్భంలో సీఎం కేసీఆరే.. 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.

Exit mobile version