Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ ‘డిప్యూటీ తహసీల్దార్’ సస్పెండ్

స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అధికారి చొరబడిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 04:00 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అధికారి చొరబడిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ అయిన ఆనంద్ కుమార్ రెడ్డి ప్రవేశించి హల్ చల్ చేశాడు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆనంద్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

తన ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడిన ఘటన గురించి స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ” ఓ రోజు అర్ధరాత్రి నాకు భయానక అనుభవం ఎదురయింది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. ధైర్యంగా.. చాకచక్యంగా.. నన్ను నేను రక్షించుకున్నా. అందుకే ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రిపూట తలుపులు, తాళాలను చెక్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేయండి.” అని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్.