Site icon HashtagU Telugu

IAS Smita Sabharwal : మ‌హిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి చొర‌బొడ్డ డిప్యూటీ త‌హ‌సీల్దార్‌

Smita Sabharwal

Smita Sabharwal

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లోని మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్‌ నివాసంలోకి రెండు రోజుల క్రితం అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డారని సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ఈ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె చేసిన ట్వీట్లను డిప్యూటీ తహసీల్దార్ రీట్వీట్ చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు స్నేహితుడైన హోటల్ యజమాని కారులో గేటెడ్ కమ్యూనిటీ వద్దకు వచ్చారు. ఐఏఎస్ అధికారిణి నివాసాన్ని సందర్శించేందుకు అక్కడికి వచ్చామని సెక్యూరిటీకి చెప్ప‌డంతో వారిని లోనికి అనుమతించారు., డిప్యూటీ తహసీల్దార్ ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ ఇంటికి వెళ్లి త‌లుపు కొట్ట‌డంతో ఆమె డోర్ ఓపెన్ చేశారు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తి అర్థ‌రాత్రి ఇంటికి రావ‌డంతో ఆమె షాక్‌కి గురైయ్యారు. డిప్యూటీ తహసీల్దార్ తన పని గురించి మాట్లాడటానికి వచ్చానని చెప్పారు. వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన స్మితా స‌బ‌ర్వాల్‌.. డిప్యూటీ తహసీల్దార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి స్నేహితుడిని, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌ని అదుపులోకి తీసుకున్నారు