Site icon HashtagU Telugu

Telangana Budget 2024 : అందరి కోసం మనమందరం అంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి

Telangana Budget 2024

Telangana Budget 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget 2024) 3వ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote On Account Budget) ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తాం. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం. సామాజిక న్యాయం చేసి చూపిస్తాం. మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నీటిపారుదల శాఖపై ఎల్లుండి12న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ పెట్టనుంది. అనంతరం 13న మేడిగడ్డకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లనుంది. ఇక రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సంక్షేమం, అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. బడ్జెట్‌లో 6 హామీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్‌రెడ్డి సర్కార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అధికార పార్టీ చెప్పుకొచ్చింది.

Read Also : Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?