Deputy CM Bhatti: 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపును స్వాగతించిన డిప్యూటీ సీఎం భట్టి

ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Deputy CM Bhatti

Deputy CM Bhatti

Deputy CM Bhatti: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ స్లాబ్‌ల రేషనలైజేషన్ ప్రతిపాదనపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti) విక్రమార్క మల్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 12 శాతం స్లాబ్‌ను తొలగించడం, కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించడం వంటి వాటికి సూత్రప్రాయంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.

లోతైన పరిశీలన అవసరం

అయితే ఈ ప్రతిపాదనలో భాగంగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున దానిపై మరింత లోతైన పరిశీలన అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల వినియోగదారులకు నిజంగా లాభం చేకూరడంతో పాటు, రాష్ట్ర ఆదాయాలపై పడే ప్రభావం, దానికోసం ఏర్పాటు చేయాల్సిన పరిహార వ్యవస్థపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Also Read: Jio Prepaid Plan: రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్!

మంత్రుల సమూహానికి (GoM) పంపాలనే ప్రతిపాదన

జీఎస్టీ రేటు రేషనలైజేషన్‌పై ఇప్పటికే మంత్రుల సమూహం (GoM) పనిచేస్తున్నందున కొత్త ప్రతిపాదనలను కూడా ఆ గ్రూప్‌కు పంపించడం సముచితమని భట్టి అభిప్రాయపడ్డారు. ఈ మంత్రుల సమూహం అన్ని కోణాల నుంచి ఈ అంశాన్ని పరిశీలించి, జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సులు చేస్తే సరైన నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే పరిహార సెస్ అంశాన్ని కూడా ఇదే గ్రూప్‌కు అప్పగించాలని సూచించారు. రాష్ట్రాల అభిప్రాయాలు ఎక్కువగా ప్రతిఫలించేలా మంత్రుల సమూహం (GoM) సభ్యత్వాన్ని పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో భేటీ

ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

  Last Updated: 20 Aug 2025, 10:25 PM IST