Site icon HashtagU Telugu

Arogya Utsavalu : పదేళ్లు ప్రజా ఆరోగ్యాన్ని బిఆర్ఎస్ గాలికి వదిలేసింది – భట్టి

Bhatti Speech

Bhatti Speech

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిచిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka ). ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా సోమవారం హైదరాబాద్​లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఆరోగ్య ఉత్సవాలను (Arogya Utsavalu) సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని వివరించారు. వైద్యశాలల మెరుగుదల, వైద్య సేవల అందుబాటులో పెరుగుదల వంటి అంశాలపై దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో కొత్త ఆసుపత్రులు, మెరుగైన వైద్య పరికరాలు అందించేందుకు కాంగ్రెస్ పాలనలో తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు. ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ప్రత్యేకమైనదని , నిరుద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలను అందించినట్లు ఆయన వివరించారు.

108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్సులకు అందుబాటులోకి తీసుకొచ్చామని (213 ambulances flagged off by CM to celebrate ‘Health Festival’) పేర్కొన్నారు. అలాగే పారామెడికల్ విద్యారంగంలో అభివృద్ధికి దోహదం చేసే విధంగా 28 కొత్త పారామెడికల్ కాలేజీలను ప్రారంభించాం అన్నారు. ఇలా ఏడాది లోనే ఇంత చేసిన కాంగ్రెస్ పై బిఆర్ఎస్ ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకంటే ఎక్కువ అభివృద్ధి ఏడాదిలోనే కాంగ్రెస్ చేసే సరికి బిఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని భట్టి పేర్కొన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పట్టించుకోలేదు, ఆరోగ్య శ్రీ గురించి పట్టించుకోలేదు, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, సిబ్బంది నియామకాన్ని విస్మరించారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు తగుదునమ్మా అని బజారు మీదకొచ్చి ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం అన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య, ఉపాధి రంగాల్లో మరింత శ్రేయోభిలాషి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించారు. సమగ్ర అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ చూపించిన మార్గదర్శకత తెలంగాణ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతికి కొనసాగుతూనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Read Also : Maharashtra CM Name: డిసెంబరు 5న మహారాష్ట్రలో ముగ్గురు మాత్రమే ప్రమాణస్వీకారం.. కీల‌క శాఖలు బీజేపీ ద‌గ్గ‌రే!