TS : గృహ జ్యోతికి అప్లై చేసిన బిల్లు వచ్చిందా ..? అయితే కట్టనవసరం లేదు – భట్టి

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది గృహ జ్యోతి (Gruha Jyothi Scheme )కి అప్లై చేసినప్పటికీ బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) బిల్లుల ఫై క్లారిటీ […]

Published By: HashtagU Telugu Desk
Deputy Cm Bhatti Vikramarka

Deputy Cm Bhatti Vikramarka

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది గృహ జ్యోతి (Gruha Jyothi Scheme )కి అప్లై చేసినప్పటికీ బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) బిల్లుల ఫై క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

200 యూనిట్ల లోపు వాడినా బిల్లు వస్తుంటే.. అలాంటి వారు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని భట్టివిక్రమార్క క్లారిటీ ఇచ్చారు. కొందరు లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం.. సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని అన్నారు. బిల్లులు వచ్చిన వారు.. తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లుల కాపీలతో ఎంపీడీవో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే బిల్లు వచ్చిన వారు.. కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ అధికారులు కూడా వారిని బిల్లు కట్టాలంటూ వేధించబోరని స్పష్టం చేసారు. మీ వివరాలను అధికారులకు అందజేస్తే.. వచ్చే నెల నుంచి జీరో బిల్లు వస్తుందని తెలిపారు.

Read Also : BJP-TDP-JSP Joint Meeting : ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ..?

  Last Updated: 09 Mar 2024, 08:03 PM IST