తెలంగాణ విద్యుత్తు శాఖ (Telangana Electricity Department)లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మరియు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 92 మంది జూనియర్ అసిస్టెంట్స్ మరియు 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
Budget 2025: బడ్జెట్ 2025.. ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు?
ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. 2023లో 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, కొన్నింటి కోసం కోర్టు కేసులు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా నియామక పత్రాలు ఇస్తూ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 56,000 ఉద్యోగాలు 2023లో ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి గౌరవంగా నిలిచిందని, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిపోతున్న తరుణంలో ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ పథకాలను కూడా ప్రస్తావించారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో పని చేస్తున్నామని, 2035 నాటికి 40,000 మెగావాట్ల ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ రైతులకు రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని, బీఆర్ఎస్ పార్టీది కాదని , కేసీఆర్ పాలనలో రైతు బంధు కట్టకుండా వదిలి వెళ్లిన సొమ్ముల్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే క్లియర్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం.. రూ. 7,620 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇంకా భట్టి ఏమేమి మాట్లాడారో ఈ కింది వీడియో లో చూడండి.