Site icon HashtagU Telugu

TGSRTC : ప్రైవేట్ సంస్థలకు డిపోలు..ఉద్యోగుల్లో ఆందోళన

Depots For Private Companie

Depots For Private Companie

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో (Telangana RTC Employees) ఆందోళన మొదలైంది. కొత్త ప్రభుత్వం (Congress Govt) వచ్చాక ఇంకా మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్న వారికీ తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాలు వారిలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తున్న ప్రవైట్ సంస్థలకు (Pvt Company) డిపోలు అప్పగించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరంగల్-2, HYD-1 డిపోలను ఆయా సంస్థలకు అప్పగించగా..మరికొన్ని డిపోలను సైతం వారికే అప్పగించాలనే యోచనలో ఉంది. ప్రవైట్ చేతుల్లోకి డిపోలు వెళ్తే..వారు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను కాకుండా వేరే వారిని నియమించుకుంటారు. దీంతో తమను వేరే చోటకు బదిలీ చేసే అవకాశం ఉందని, ఆలా చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ ఉద్యోగులు ఖంగారు పడుతున్నారు.

Trumps First Speech : ప్రవాస భారతీయులకు షాక్.. ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం బస్సుల సర్వీసుల నిర్వహణలో ప్రత్యేక మార్పులు ఉండవచ్చని, అద్భుతమైన సౌకర్యాల కల్పన, మరింత నాణ్యమైన సేవల అందించవచ్చని భావించిన, ఉద్యోగులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల డ్రైవర్ ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని, తద్వారా ప్రస్తుత ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ వంటి ఉద్యోగాలు గతంలో ప్రభుత్వ పాలనలోనే మెరుగ్గా కొనసాగాయి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఆధారపడటం వలన తమ భవిష్యత్తు కాస్త అనిశ్చితిగా మారుతుందని వాపోతున్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో చూడాలి.