Demolish Osmania Hospital : ఉస్మానియా కూల్చివేత‌పై కేసీఆర్ స‌ర్కార్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఉస్మానియా ఆస్ప‌త్రిని (Demolish Osmania Hospital )కూల్చ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సుర‌క్షితం కాద‌ని మంత్రుల క‌మిటీ తేల్చింది.

  • Written By:
  • Updated On - July 29, 2023 / 03:23 PM IST

ఉస్మానియా ఆస్ప‌త్రిని (Demolish Osmania Hospital )కూల్చ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం కోర్టులో ఉన్న‌ప్ప‌టికీ రోగుల‌కు సుర‌క్షితం కాద‌ని మంత్రుల క‌మిటీ తేల్చింది. కొత్త భ‌వ‌నాన్ని నిర్మించ‌డానికి రూ. 200కోట్ల‌తో్ అంచ‌నాల‌ను త‌యారు చేశారు. ఆ ప్ర‌కారం ఉస్మానియాకు కొత్త రూపం ఇవ్వాల‌ని తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి ప్ర‌స్తుతం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఉస్మానియా ఆస్ప‌త్రిని కూల్చ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం(Demolish Osmania Hospital )

ప్రస్తుతం ఉన్న‌ భవనం ఆసుపత్రికి పనికిరాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. కొత్త ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిని.(Demolish Osmania Hospital )  35.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల‌ని నిర్ణ‌యించింది. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆరోగ్య శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఎంఏ అండ్‌ యూడీ, ఆర్‌ అండ్‌ బీ, ఓజీహెచ్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ, ప్రస్తుత ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం సురక్షితంగా లేదని ప్రభుత్వం పేర్కొంది.

క‌నీసం 1812 పడకలు అవసరమ‌ని సూపరింటెండెంట్ డాక్టర్ B. నాగేందర్ తెలిపిన

పాత భవనం ఎలాంటి రోగుల సంరక్షణకు పనికిరానిదని స్ప‌ష్టం చేసింది. సుమారు 35.76 లక్షల చదరపు అడుగుల ప్రత్యామ్నాయ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న‌ భవనాలతో పాటు ఉస్మానియా మెయిన్ బ్లాక్ భవనాన్ని (Demolish Osmania Hospital ) తొలగించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ తరపున దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. శిథిలావస్థలో ఉన్నందున 1100 పడకల బలం ఉంది. ప్ర‌స్తుతం పెరిగిన రోగుల ర‌ద్దీకి అనుగుణంగా క‌నీసం 1812 పడకలు అవసరమ‌ని సూపరింటెండెంట్ డాక్టర్ B. నాగేందర్ తెలిపిన విష‌యాన్ని కూడా అఫిడ‌విట్ లో ప్ర‌భుత్వం పేర్కొంది.

Also Read : CM KCR: హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం మొహర్రం 

హైదరాబాద్‌ చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1919లో ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి నిర్మించారు. దాన్ని 2015 జూలై 23న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిని సందర్శించారు.ఆ సంద‌ర్భంగా రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. శిథిలమైన ఆస్ప‌త్రిని కూల్చివేసి రూ.200 కోట్లతో ఆధునిక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం తర్వాత అనుకూల,వ్యతిరేకంగా పిటిషన్లు, పిల్ లు దాఖలయ్యాయి. అదే స‌మ‌యంలో డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 3, 2010న జారీ చేయబడిన GO 313లో పేర్కొన్న విధంగా ప్రస్తుత నిర్మాణం మరియు కొత్త భవనాలను పునరుద్ధరించాలని కోరుతూ HCని ఆశ్రయించింది. మొత్తం మీద భవిష్యత్తుపై ఉన్న గందరగోళానికి ప్ర‌భుత్వం ముగింపు పలికింది. కొత్త భవనాన్ని నిర్మించడానికి  (Demolish Osmania Hospital ) పాత‌దాన్ని కూల్చివేయాలని నిర్ణ‌యించ‌డం సంచ‌ల‌నం.

Also Read : BRS Party: లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం, మజ్లిస్ మద్దతు!

పాత చిహ్నాల‌కు అనుగుణంగా ఈ భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. ఎన్నిక‌ల వేళ ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేత రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.