Site icon HashtagU Telugu

Demolish BRS office in Nalgonda : బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయండి..హైకోర్టు ఆదేశాలు

Nalgonda Brs Party Office

Nalgonda Brs Party Office

High Court Big Shock To BRS Office : బిఆర్ఎస్ (BRS) పార్టీ కి గత కొద్దీ నెలలుగా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ పక్క గెలిచిన ఎమ్మెల్యేల తో పాటు మాజీ నేతలు పార్టీని వీడుతూ షాకులు ఇవ్వగా..ఇప్పుడు పార్టీ ఆఫీస్ లు సైతం కూల్చేయాలంటూ కోర్ట్ లు ఆదేశాలు (Court Orders) ఇస్తుండడంతో అధినేత కేసీఆర్ కు (KCR) ఆ పార్టీ నేతలకు ఏంచేయాలో అర్ధం కావడం లేదు.

తాజాగా న‌ల్లగొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ (Nalgonda BRS Office) ను 15 రోజుల్లో కూల్చివేయాలని (Demolish ) మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు (Telangana High court) ఆదేశాలు జారీ చేసింది. ముందుగా పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేసే అవ‌కాశం ఇవ్వాల‌ని , కూల్చ‌న‌ట్ల‌యితే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయాల‌ని ఆదేశించింది. నల్గొండలో ఉన్న బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్‌ కట్టి… ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చేయాలని స్పష్టం చేసింది. దీంతోపాటు దానికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో లక్షరూపాయలను బీఆర్‌ఎస్ పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది.

2018లో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో రెండెకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. 99 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది. ఏడాదికి గజానికి వంద రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy).. బీఆర్ఎస్ ఆఫీసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ..15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ కార్యాల‌యం కూల్చివేత‌కు అధికారుల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

Read Also : Anasuya’s Shocking Comments : జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..