ఫిబ్రవరి నెలలోనే తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తాగేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన ధరలు చూసి బీర్ తాగాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో బీరు ప్రియులు తమ డిమాండ్స్ ను ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. ప్రత్యేకంగా బీర్ల ధరలను రూ. 100కి తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికోసం ఏకంగా ప్రజావాణి కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు. ఈ డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR : పులివెందుల ఇంచార్జ్ గా రఘురామకృష్ణంరాజు ..?
గతంలో బీర్ల సరఫరా తగ్గిన సందర్భాల్లో, బీరు ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్నిసార్లు సరఫరా నిలిచిపోవడంతో నిరసనలకు కూడా దిగారు. కింగ్ ఫిషర్ బీరు కొంతకాలం సరఫరా నిలిపివేయడం, ఆపై ప్రభుత్వ జోక్యంతో తిరిగి అందుబాటులోకి రావడం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా ముందుగా వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని, సరిపడా స్టాక్ ఉండేలా చూడాలని, అంతేకాదు ధరలు తగ్గించాలని బీరు ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తాము కోరిన విధంగా స్పందించకపోతే ప్రత్యేక సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ డిమాండ్ పై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. కానీ బీరు ప్రియులు తమ కోరికను నెరవేర్చాలని పట్టుదలతో ఉన్నారు. వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు పెరగడం సహజమే, కానీ ధరలు పెరిగితే తమకే భారమవుతుందని వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి.