Site icon HashtagU Telugu

Khammam MP Seat : ఖమ్మం ఎంపీ సీటు..ఇది చాల హాట్ గురూ..!!

Kmm Mp

Kmm Mp

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధమైంది..అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణ ఇచ్చిన సోనియా కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ (CM Revanth)..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే విజయం సాధించి మరోసారి సోనియా (Sonia) కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో ఎంపీ సీటు (MP Seat) కోసం పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దీంతో మూడు రోజులుగా గాంధీ భవన్ లో సందడి నెలకొంది. ఎంపీ టికెట్ కోసం వందలమంది దరఖాస్తులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం ఎంపీ సీటు అనేది హాట్ కేకులా మారింది.

ఖమ్మం టికెట్ (Khammam MP Seat) కోసం ఎక్కువ మంది ఆశావహులు క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు గాను తొమ్మిదింటిలో గెలవడంతో కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీకి కూడా ఖమ్మం లోక్‌సభ సీటు కోసం అత్యధిక స్థాయిలో దరఖాస్తులు అందాయి. దాదాపు ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారంటే ఈ స్థానానికి ఎంత డిమాండ్ ఏర్పడిందో చెప్పాల్సిన పనిలేదు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ స్థానానికి డిమాండ్ ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం ఎంపీ సీటుకు కాంగ్రెస్ లో పలుకుబడి కలిగిన లీడర్లు, వారి భార్యలు, వారసులు టిక్కెట్లు కోరుకుంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఈ స్థానంలో సోనియాగాంధీని పోటీ చేయాలంటూ ఆహ్వానించారు. PCC తరపున ఓ తీర్మానం కూడా చేసి AICC కి పంపారు. సోనియా పోటీ చేస్తారా.. లేదా.. అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారా అన్నది సందేహం గా ఉంది. అయితే ఖమ్మం పార్లమెంట్ సీటుపై ఎప్పటి నుంచో మాజీ ఎంపీ రేణుకా చౌదరి చూస్తున్నారు. గతంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు కూడా. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారంలోనూ రేణుక పాల్గొన్నారు. ఢిల్లీ లెవల్లో గాంధీ కుటుంబంతో పాటు ఇతర AICC పెద్దలతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. అందుకే AICC స్థాయిలో రేణుకా చౌదరి ఈ టిక్కెట్ కోసం ముందు నుంచీ పైరవీలు చేసుకుంటున్నారు. ఇక ఈ స్థానం కోరుకుంటున్న వాళ్ళల్లో మరో ముఖ్యురాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని. ఈమె తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా ట్రై చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అందుకే సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీహెచ్ ఉండేది హైదరాబాద్ లో అయినా.. ఖమ్మం స్థానం నుంచి గెలుపు గ్యారంటీ కావడంతో టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు.

వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా తనకు టిక్కెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఆయన పేరు కూడా పరిశీలించాలని పొంగులేటి వర్గీయులు కోరుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. ఇలా హేమాహేమీలు అనేక మంది పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఈరోజు ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీగా హైదరాబాద్‌కు బయలు దేరారు. మరి అధిష్టానం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికీ ఇస్తారనేది చూడాలి.

Read Also : Jharkhand MLAs : హైదరాబాద్​లో జార్ఖండ్‌​ ఎమ్మెల్యేలు.. రంగంలోకి సీఎం రేవంత్.. 300 మందితో భద్రత

Exit mobile version