Site icon HashtagU Telugu

Telangana Elections: తగ్గేదేలే.. జోరుగా ఎన్నికల ప్రచారం, హెలికాప్టర్స్, విమానాలకు ఫుల్ డిమాండ్!

Helicopter Pooja yadadri

Helicopter Pooja

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఫలితంగా హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. పార్టీలు సుడిగాలి పర్యటనలు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎన్నికల ర్యాలీలు ప్లాన్ చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులను, స్టార్ క్యాంపెయినర్లను రప్పించుకోవడం కోసం హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అవసరం. అయితే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇండియన్ ఫ్లై సర్వీసెస్, జెట్‌సెట్‌గో వంటి కంపెనీల నుండి హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటున్నాయి పలు రాజకీయ పార్టీలు

ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు, సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నాయి. సాధారణంగా, సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ధర గంటకు రూ. 1.5 లక్షల నుంచి మొదలవుతుండగా, డబుల్ ఇంజన్ హెలికాప్టర్ల ధర గంటకు రూ. 2.75 లక్షలు వసూలు చేస్తున్నాయి.

రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇతర రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్లతో తెలంగాణలో ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి. దీంతో నాయకుల పర్యటనల కారణంగా హెలికాప్టర్లు, చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.  స్టార్ క్యాంపెయినర్ ను ప్రచారానికి ఇన్వైట్ చేస్తే ఆయన హెలికాప్టర్‌ను ఉపయోగిస్తే పార్టీ అన్ని ఖర్చులను భరిస్తుందని సమాచారం. కాగా ఇప్పటికే తొలి జాబితాను అన్ని పార్టీల కంటే ముందే ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్స్ హరీశ్ రావు, కేటీఆర్ హెలికెప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Also Read: Bjp Janagarjana Sabha: తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్ ఒక్కడే కాదు