Site icon HashtagU Telugu

Delhi Tour Secrets : కేసీఆర్ ఢిల్లీ టూర్ టాక్స్

Delhi Tour Secrets

Kcr Delhi

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న (Delhi Tour Secrets)  ఖ‌రారు అయింది. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న(KCR) హ‌స్తిన ఫ్లైట్ ఎక్క‌నున్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి వెళుతున్నారు. గురువారం మ‌ధ్యాహ్నాం ఆఫీస్ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణ‌యించారు. తిరిగి శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాదుకు చేరుకుంటారు. ఇదీ అధికారికంగా సీఎంవో ఆఫీస్ నుంచి వెలువ‌డిన షెడ్యూల్‌. కానీ, ఆయ‌న ఢిల్లీ టూర్ వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న (Delhi Tour Secrets)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన వ్య‌వ‌హారం బీఆర్ఎస్ పార్టీని ఉక్కిబిక్కిరి చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ అల్లుడు అనిల్ పేరు స్కామ్ లో ఉంది. మూడో చార్జిషీట్ లో ఆయ‌న పేరును ఈడీ పేర్కొంది. అనుబంధ చార్జిషీట్ లో పొందుప‌రిచిన అంశాల ప్ర‌కారం అనిల్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు, కుమార్తె క‌విత సౌత్ గ్రూప్ హెడ్ గా భారీ లావాదేవీలు జ‌రిపిన‌ట్టు ఈడీ నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆమె ఆడిట‌ర్ బుచ్చిబాబు అప్రూవ‌ర్ గా మారిని విష‌యం విదిత‌మే. అత‌ను ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం క‌విత వ్య‌వ‌హారం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. హ‌వాలా జ‌రిగిన‌ట్టు ఈడీ అనుమానిస్తోంది. ఢిల్లీ స్కామ్ లోని డ‌బ్బును హైద‌రాబాద్ లో భూముల కొనుగోలుకు పెట్టిన‌ట్టు ఆధారాల‌ను రాబ‌ట్టింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం బీఆర్ఎస్ పార్టీని ఉక్కిబిక్కిరి

ఇప్ప‌టికే మూడుసార్లు క‌విత ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు. ఆమె ఈడీ విచార‌ణ‌కు ఢిల్లీ వెళ్లే ముందుగా అప్ప‌ట్లో కేసీఆర్ హ‌స్తిన టూర్ కు(Delhi Tour Secrets) వెళ్లారు. ఆ త‌రువాత ధైర్యంగా వెళ్లిర‌మ్మ‌ని కుమార్తె బూస్ట‌ప్ ఇచ్చారు. ఆయ‌న చేసిన ఢిల్లీ లైజ‌నింగ్ కార‌ణంగా క‌విత అరెస్ట్ కాలేద‌ని కాంగ్రెస్ చెబుతోంది. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుని పోతుంద‌ని బీజేపీ అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో చార్జిషీట్ కు వేసిన అనుబంధ చార్జిషీట్ లోని అంశాలు వెలుగుచూశాయి. వాటికి సంబంధించిన విచార‌ణ ఈనెల 10వ తేదీన జ‌ర‌గ‌నుంది. అందుకే, కేసీఆర్ టూర్లో ఇదో కీల‌క అంశంగా ఉంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ప్లాన్ (Delhi Tour Secrets)

ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మ‌రో నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లంటూ ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌తినిధుల స‌భ‌లో ఆయ‌న సంకేతాలు ఇచ్చారు. అంటే, అక్టోబ‌ర్లో ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని భావిస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం అందుకు సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్ గ‌డ్ బీజేపీ విభాగాలు లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో ఆయా రాష్ట్రాల ఎన్నిక‌లు పెట్టాల‌ని అధిష్టానంకు సూచించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక వేళ అదే జ‌రిగితే, కేసీఆర్ (KCR) మూడోసారి సీఎం కావ‌డం క‌ష్టంగా మారుతుంది. అందుకే, అక్టోబ‌ర్లో ఎన్నిక‌లకు వెళ్లేలా లైజ‌నింగ్ చేసుకోవ‌డానికి కేసీఆర్ ఢిల్లీ టూర్ (Delhi Tour Secrets) అంటూ మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

కేసీఆర్ పేరు జాతీయంగా మోగాల‌ని బీఆర్ఎస్ ప్లాన్

అధికారం స‌మాచారం ప్ర‌కారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్స‌వానికి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. అక్క‌డ రాజ‌శ్యామల‌ యాగం నిర్వ‌హిస్తున్నారు. ఆహూతి కార్య‌క్ర‌మానికి ఆయ‌న వెళుతున్నారు. అదే స‌మ‌యంలో ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ కేంద్రంగా జాతీయ నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నితీష్ కుమార్ చాలా వేగంగా ప్ర‌ధాని మంత్రి ప‌ద‌వి కోసం అడుగులు వేస్తున్నారు. ఆయ‌న‌కు బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా మ‌ద్ధ‌తు ప‌లికారు. మ‌రో వైపు ఎన్సీపీ నేత శ‌ర‌త్ ప‌వార్ దాదాపుగా రేస్ నుంచి త‌ప్పుకున్న‌ట్టే. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేజ్రీవాల్, కేసీఆర్ మాత్రం వెనుక‌బ‌డ్డారు. లిక్క‌ర్ స్కామ్ లో కేజ్రీవాల్ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. దీంతో మ‌మ‌త‌, నితీస్ స‌ర‌స‌న కేసీఆర్ పేరు జాతీయంగా మోగాల‌ని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం లైజ‌నింగ్ ఢిల్లీ కేంద్రంగా చేసుకోవ‌డానికి కేసీఆర్(Delhi Tour Secrets) వెళుతున్నారని కొంద‌రు అభిప్రాయం.

Also Read : CM KCR: కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’!

మొత్తం మీద కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రెండో రోజులు ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ మూడు ప్ర‌ధాన అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్, ముంద‌స్తు ఎన్నిక‌లు, ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఫోక‌స్ కావ‌డం ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ఆయ‌న దూరంగా ఉండ‌డాన్ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. స‌రిహ‌ద్దులు కూడా తాట‌లేని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్రభావం కేసీఆర్ జాతీయ నాయ‌కుడి హోదాను వెంటాడుతోంది. దానికి ఢిల్లీ నుంచే కేసీఆర్ (Delhi tour Secrets) సమాధానం చెబుతార‌ని బీఆర్ఎస్ క్యాడ‌ర్ భావిస్తుంది. ఆయ‌న (KCR) ఎలాంటి మెసేజ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఇస్తారో, చూద్దాం.!

Also Read : BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు, జాతీయ రాజకీయాలే లక్ష్యం!