Delhi Liquor scam : క‌విత‌కు ష‌ర్మిల `కిక్`, రాజ‌కీయ నిషా

ఢిల్లీ లిక్క‌ర్ (Delhi Liquor scam) వ్య‌వ‌హారం మ‌లుపు తిరుగుతోంది. .

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 01:32 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Delhi Liquor scam) వ్య‌వ‌హారం మ‌లుపు తిరుగుతోంది. వాట్స‌ప్ చాట్ ను నిందితుడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ (sukesh chandrasekar) విడుద‌ల చేయ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది. ఎవ‌డో చెప్పిన‌దాన్ని మీడియా ప్ర‌చురిస్తుంద‌ని, టీవీలు ప్ర‌సారం చేస్తున్నాయ‌ని ఎమ్మెల్సీ క‌విత చుర‌క‌లు వేసింది. దున్న‌పోతు ఈనిందంటే, దూడ‌ను క‌ట్టేయ‌మ‌న్న‌ట్టు మీడియా న్యూస్ ఇస్తుంద‌ని అన్నారు. గ‌తంలోనూ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ న్యూస్ లో త‌న‌పేరు లేకుండా చేయాల‌ని హైకోర్టుకు క‌విత వెళ్లారు. ఆ మేర‌కు కోర్టు కూడా క‌విత పేరును ప్ర‌స్తావించ‌డానికి లేద‌ని చెప్పింది. కానీ, ఆ త‌రువాత సీన్ మారింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం మ‌లుపు(Delhi Liquor scam) 

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో(Delhi Liquor scam) క‌విత‌ను సీబీఐ తొలుత విచారించింది. హైద‌రాబాద్ లోని ఆమె ఇంటి వ‌ద్దే విచార‌ణ చేసింది. ఆమె చెప్పిన చోట‌, చెప్పిన ప్లేస్, చెప్పిన రోజు సీబీఐ విచార‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌రువాత ఈడీ రంగంలోకి దిగింది. నోటీసులు జారీ చేసింది. ఆమె ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు వెళ్లాల్సి వ‌చ్చింది. తొలిసారి ఈడీ విచార‌ణ‌కు వెళ్లే స‌మ‌యంలో ధైర్యం సీఎం కేసీఆర్ ధైర్యం నూరిపోశారు. ఏమీ కాదు, ఢిల్లీ వెళ్లి ఈడీ విచార‌ణ‌ను ఫేస్ చేయ‌మంటూ చెప్పారు. ఆ మేర‌కు ఆమె ఢిల్లీ వెళ్లారు. తొలి రోజు విచార‌ణ టెన్ష‌న్ గా సాగింది. ఆ త‌రువాత రెండు, మూడోసారి విచార‌ణ సంద‌ర్భంగా క‌విత చాలా వ‌ర‌కు ఫ్రీగా క‌నిపించారు. తెలంగాణ మ‌హిళ ధైర్యంగా ఈడీ విచార‌ణ ఎదుర్కొంద‌ని సానుభూతిని తీసుకొచ్చే ప్ర‌య‌త్నం బీఆర్ఎస్ చేసింది. ఫైట‌ర్ డాట‌ర్ అంటూ హోర్డింగ్ లు పెట్టారు.

ఫైట‌ర్ డాట‌ర్ అంటూ హోర్డింగ్ లు

ఏదైనా ఇష్యూలో మంత్రులు, ఎమ్మెల్మేలు ఉన్న‌ట్టు న్యూస్ రాగానే ఏ పార్టీ అయినా చ‌ర్య‌లు తీసుకుంటుంది. గ‌తంలోనూ మాజీ మంత్రి రాజ‌య్య‌, ఈటెల రాజేంద్ర విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. వాళ్ల‌ను మంత్రివ‌ర్గం నుంచి తొలగించింది. మాజీ మంత్రి ఈటెల విష‌యంలో అయితే, దారుణంగా కేసీఆర్ కుటుంబం వ్య‌వ‌హ‌రించింది. ఆయ‌న్ను బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. కేవలం మంత్రి కేటీఆర్ చేస్తోన్న సీఎం ప్ర‌య‌త్నాల క్ర‌మంలో ఈటెల మ‌రో ఎపిసోడ్ న‌డిపార‌ని బ‌ర్త‌ర‌ఫ్ ఎపిసోడ్ న‌డిచింద‌ని ఆనాడు వినిపించిన మాట‌.

 

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో (Delhi Liquor scam)విచార‌ణ ఎదుర్కొంటోన్న క‌విత‌ను మాత్రం బీఆర్ఎస్ రాజ‌కుమారిలా చూస్తోంది. ఆమె విచార‌ణ‌కు వెళ్లిన సంద‌ర్భంగా మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. అండ‌గా నిలుస్తూ బీఆర్ఎస్ ఐకాన్ గా క‌విత‌ను నిలిపారు. క్షేత్ర‌స్థాయిలో క‌విత కోసం పోరాటాల‌కు దిగారు. కేంద్ర ప్ర‌భుత్వం వేధింపులంటూ సానుభూతి దిశ‌గా ఢిల్లీ లిక్క‌ర్ లో క‌విత ఎపిసోడ్ ను న‌డిపారు. ఇప్పుడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ (sukesh chandrasekar ) విడుద‌ల చేస్తోన్న చాటింగ్ ల‌ను కూడా లైట్ గా కొట్టిపారేస్తున్నారు. అత‌నెవ‌రో కూడా తెలియ‌దంటూ క‌విత చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌దునైనా బాణాల‌ను
వ‌దులుతూ ష‌ర్మిల ట్వీట్ చేస్తే క‌విత‌ను టార్గెట్ చేశారు.

సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ చేస్తోన్న చాటింగ్

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అమ్మ కవితమ్మ.. నీ బండారం బట్టబయలు అయితే, అవి మీడియా ప్రసారం చేస్తే, పాత్రికేయులకు మీడియా సంస్థలకు విలువల్లేవని మాట్లాడుతున్న నీకు ఏం విలువలు ఉన్నట్టు? అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా అంటూ వైయస్ షర్మిల చురకలు అంటించారు.

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్!

లిక్కర్ స్కాంలో (Delhi Liquor scam)రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? అంటూ ప్రశ్నించారు. ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? చెప్పాలన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇయ్యమంటావా? అంటూ షర్మిల కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ప‌నికిమాలిన ప‌నులు అంటూ ట్వీట్లు చేసి రాజ‌కీయాల‌ను హీటెక్కించారు ష‌ర్మిల‌.

Also Read : MLC Kavitha: ఫేక్ చాట్ లతో దుష్ప్రచారం, సుఖేశ్ తో నాకెలాంటి పరిచయం లేదు!