Delhi Liquor scam : తెలంగాణ నేతలకు సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల భయం పట్టుకుంది. పైకి ఈడీ, బోడీ కేసులకు జంకేది లేదంటున్నా, లోలోపల మాత్రం ఎవరికి వారే ఆందోళన చెందుతున్నారని క్యాడర్ చర్చించుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోనే ఈ సంస్థలన్నీ దాడులు చేస్తున్నాయని చాలా రోజులుగా ఉన్న ఆరోపణ. అందుకు, సంబంధించిన ఉదాహరణలను మీడియా వేదికగా సీఎం కేసీఆర్ ప్రదర్శించారు. దానికి వాషింగ్ పౌడర్ నిర్మా సిద్ధాంతాన్ని కూడా ఆపాదించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిపోగానే అవినీతి ఆరోపణలున్న వారు కడిగిన ముత్యాలు అవుతున్నాయని ఆరోపించారు. ఎవరు భయపడినా తెలంగాణలోని బీఆర్ఎస్ భయపడదని మోడీకి అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.
కేసీఆర్ బీజేపీ పెద్దలతో ఫిక్సింగ్ చేసుకున్నారని కాంగ్రెస్ (Delhi Liquor scam)
ఆ మధ్య ఢిల్లీ వెళ్లిచ్చిన కేసీఆర్ బీజేపీ పెద్దలతో ఫిక్సింగ్ చేసుకున్నారని కాంగ్రెస్ చెబుతోంది. దానికి బలం చేకూరేలా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ లేకుండా పోవడాన్ని చూపిస్తున్నారు. వాస్తవంగా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉందని తొలుత బీజేపీ నేతలు వీడియోలను బయట పెట్టారు. వాటిని ఈడీ, సీబీఐలకు కూడా అందించారు. ఆమె అరెస్ట్ ఖాయమంటూ బీజేపీ అగ్రనేతలు సైతం బల్లగుద్ది చెప్పారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్ గా కల్వకుంట్ల కుటుంబం అరెస్ట్ అవుతుందని తెలంగాణ వేదికపై ప్రకటించారు. ప్రభుత్వాన్ని కల్చేస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. వాళ్లిద్దరూ చెప్పింది నిజమని చాలా మంది నమ్మారు. రాబోవు రోజుల్లో బీజేపీదే భవిష్యత్ అంటూ ఆ పార్టీ కండువా కొందరు కప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే, లిక్కర్ స్కామ్ విచారణ నుంచి కవిత క్షేమంగా బయటపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం
ఎప్పుడైతే, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాలేదో, అప్పుడే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం బయటకు వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ పెద్దగా తెలంగాణ సమాజం పట్టించుకోలేదు. కానీ, కవితకు క్లీన్ చిట్ రావడంతో ఆ రెండు పార్టీల మధ్య ఫిక్సింగ్ ఉందని అనుమానించింది. దానికి తోడుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను అకస్మాత్తుగా మార్చేసింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ చీఫ్ గా చేసింది. దీంతో కేసీఆర్, మోడీ మధ్య ఏదో ఒప్పందం కుదిరిందని బీజేపీ లీడర్లే అంతర్గతంగా మాట్లాడుకోవడం ప్రారంభం అయింది. ఫలితంగా ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని సర్వేల సారాంశం. అందుకే, ఇప్పుడు కవితకు నోటీసులు ఇచ్చారని మరో వాదన బయలుదేరింది.
Also Read : Election Drugs : ఎన్నికల ముందు `డ్రగ్స్` కేసులు తెరపైకి..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన శరశ్చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వాగ్మూలం ప్రకారం కవితకు ఈడీ సమన్లు ఇచ్చింది. వాటి ప్రకారం శని, ఆదివారాలు ఆమె ఢిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలి. కానీ, ఈడీ సమన్లు మీద కవిత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆమెకు ఉపశమనం కలిగేలా ఈనెల 26వ తేదీ వరకు విచారణ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమన్లపై వేసిన పిటిషన్ మీద వాదనలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు ఢిల్లీ వెళితే ఏదైనా జరగడానికి అవకాశం ఉందని రాజకీయ సర్కిల్స్ లోని టాక్. మరోసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లోని చర్చ. అదే ప్రత్యర్థి పార్టీలు కూడా చెబుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య బంధాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read : Eelection in April : KCR కు అంతుబట్టని BJP స్కెచ్!