Site icon HashtagU Telugu

MLC Kavitha : కవిత‌కు బెయిల్‌పై ఉత్కంఠ.. కాసేపట్లో తీర్పు

Allegations Against Kavitha

Kavitha's petition in court on CBI arrest

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌కు  బెయిల్‌ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈరోజే కోర్టు తీర్పు వెలువడనుంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టును కవిత(MLC Kavitha)  ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లోనూ ఇప్పటికే వాదనలు ముగిశాయి.

We’re now on WhatsApp. Click to Join

బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు గత నెల 22నే రౌస్‌ అవెన్యూ కోర్టులో ముగిశాయి.  దీనికి సంబంధించిన తీర్పును న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2వ తేదీకి రిజర్వు చేశారు.  అయితే ఈ తీర్పును వెలువరించే తేదీని మే 6వ తేదీకి (ఈరోజుకు) న్యాయమూర్తి వాయిదా వేశారు. ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ లభిస్తే.. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ బెయిల్‌ను కోర్టు నిరాకరిస్తే వెంటనే కోర్టులో హాజరుపరుస్తారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15 న ఈడీ అరెస్ట్ చేసింది. తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది.

Also Read :Israel Vs Hamas : గాజా నుంచి ఆర్మీని వెనక్కి పిలిచేది లేదు : ఇజ్రాయెల్