Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్

Arun Ramachandra Pillai

Arun Ramachandra Pillai

Delhi Liquor Scam: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Ramchandra Pillai)కి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదలయ్యారు.

ఢిల్లీ స్కామ్‌తో సంబంధం ఉన్న దక్షిణ భారత వ్యాపారవేత్తల జాబితాలో పిళ్లై కూడా ఉన్నారు. ఈ బృందంలో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి; శ్రీనివాసులు రెడ్డి మరియు అతని కుమారుడు రాఘవ మాగుంట; మరియు ఇతరులు ఉన్నారు.

ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం గతేడాది అక్టోబర్‌లో పిళ్లై బెయిల్ పిటిషన్‌పై నోటీసు జారీ చేసి, ఈ కేసులో ఈడీని స్పందన కోరింది. అంతకుముందు జూన్ 2023లో ట్రయల్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. ఈ కేసులో అతని ప్రమేయం ఇతర నిందితుల కంటే తీవ్రమైనదని పేర్కొంది. పిళ్లై కేవలం కుట్రలో పాలుపంచుకోలేదని, ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ కి సంబంధించిన పలు కార్యకలాపాలలో పాలు పంచుకున్నాడని ట్రయల్ కోర్టు పేర్కొంది.

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్‌లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.

Also Read: Brahma Muhurat: బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్రలేవాలో తెలుసా?