Site icon HashtagU Telugu

Delhi Excise Case: సీబీఐ చేతికి కవిత, కోర్టు అనుమతి

Delhi Excise Case

Delhi Excise Case

Delhi Excise Case: ఢిల్లీ ఎక్సైజ్ ‘స్కామ్’ పాలసీ కేసుకు సంబంధించి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు ఢిల్లీ కోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అనుమతి ఇచ్చింది. కేంద్ర సంస్థ తరఫున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సీబీఐ దర్యాప్తుకు అనుమతించారు. లిక్కర్ కేసులో కవిత ప్రమేయానికి సంబంధించి తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టును ఆశ్రయించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తీర్పును రిజర్వ్ చేస్తూ ఏప్రిల్ 8, సోమవారం కోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అంతుకుముందు కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 కింద ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న కవిత కుమారుడికి ఆమె తనతో ఉండటం అవసరమని సింఘ్వీ కోర్టుకు వివరించారు. అయినప్పటికీ బెయిల్‌ను వ్యతిరేకించింది.

We’re now on WhatsAppClick to Join

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆమె బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 22న తిరస్కరించింది. మార్చి 15న కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ లో ఆమె పాల్గొన్నట్లు ఈడీ భవిస్తూ ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు.

Also Read: Venkatesh : వెంకటేష్ కూతురి రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో చూశారా..!