Anurag Thakur: ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు, కవితను ఎలా వదిలేస్తాం: అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్‌లోని మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Updated On - November 4, 2023 / 06:01 PM IST

Anurag Thakur: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్‌లోని కత్రియా హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత పై సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత పేరు ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు. “కవితను ఎలా వదిలేస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయన కుమార్తె కవిత జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోంది. టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో నన్ను బ్యాట్స్‌మెన్‌గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ చాలా దోచుకుంది. భారీగా అవినీతికి పాల్పడ్డారు. రాజస్థాన్ సచివాలయంలో లక్షలాది రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులు తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది.

మహాదేవ్ యాప్ పేరుతో కాంగ్రెస్ అవకతవకలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మహాదేవ్ యాప్ పేరుతో రూ.508 కోట్లు అందుకున్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదు. తప్పుడు కాంగ్రెస్.. తప్పుడు హామీలు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు విదేశాల నుంచి, మహదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ జాప్యం వల్ల చాలా మంది చనిపోయారు. పార్లమెంటులో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తాడని అనుకుంటే నిరుద్యోగులను కూడా మోసం చేశారన్నారు.