Site icon HashtagU Telugu

KCR Deeksha: కేసీఆర్ దీక్షకు గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దినోత్సవం: కేటీఆర్

KCR Deeksha

KCR Deeksha

KCR Deeksha: నవంబర్ 29ని దీక్షా దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన రోజును దీక్షా దినోత్సవంగా జరుపుకోనున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష కారణంగానే 58 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేటీఆర్ చెప్పారు. 75 ఏళ్ల భారత రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ బీఆర్ఎస్ ఎజెండాతో వచ్చి లక్ష్యం కోసం ధీటైన అడుగులు వేసిన పార్టీ అని కేటీఆర్ అన్నారు.మృత్యువు నోట్లో తలపెట్టి పోరాడిన కేసీఆర్ లాగా పోరాడాలంటే ఎంతో గుండె, దమ్ము కావాలని కేటీఆర్ అన్నారు. అందుకే ఆయన పోరాటానికి గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దినోత్సవంగా జరుపుకోనున్నారు. అయితే నవంబర్ 28వ తేదీలోగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.అందుకే కేటీఆర్ ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనే అంశాన్ని రాజకీయ వర్గాలు పరిశీలిస్తున్నాయి.

KCR Deeksha

Also Read: Yuvagalam : నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమైన టీడీపీ – జనసేన నేతలు