Site icon HashtagU Telugu

Deaths In Flooded Coaching Basement : తెలంగాణ విద్యార్థి మృతి

Deaths In Flooded Coaching

Deaths In Flooded Coaching

ఐఎఎస్ (IAS)కావాలని ఎన్నో కలలు కన్నా విద్యార్థులు ఆ కల తీరకుండానే మృతువుఒడిలోకి వెళ్లారు. అనుకోని ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi )లో చోటుచేసుకుంది. గత కొద్దీ రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) సాయంత్రం కూడా అదే విధంగా భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేంద్ర నగర్‌(Rajinder Nagar)లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ (Rau’s IAS Study Circle) బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఒక అబ్బాయి ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థులను శ్రేయ, తాన్య, నెవిన్‌లుగా గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఐఎఎస్ కావాలని లక్ష్యంగా కొద్దీ నెలలుగా చాలామంది విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటూ కొంతమంది ఇక్కడే ఉంటున్నారు. నాలుగు అంతస్తుల భవనం ఇది. ఈ భవనం బేస్‌మెంట్‌లో లైబ్రరీ సహా కొందరు విద్యార్థులకు వసతి సౌకర్యం ఉంది. రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లో వరదనీరు పోటెత్తింది. ఆ సమయంలో పలువురు విద్యార్థులు లైబ్రరీలో ఉన్నారు. ఒక్కసారిగా నీరు బేస్‌మెంట్‌లోనికి ప్రవహించడంతో బయటికి వెళ్లే వీలు లేకుండాపోయింది. కొందరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకొని, జలసమాధి అయ్యారు. వీరి లో ఒకరు తెలంగాణ వాసి.

ఈ ప్రమాద ఘటన ఫై పోలీసులు స్పందిస్తూ.. ఓల్ట్ రాజిందర్ నగర్​లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్​ బేస్​మెంట్​లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పొటెత్తడం వల్ల భవనం అడుగు భాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్​ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని , వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, ​అప్పటికే బెస్​మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, ఎన్​డీఆర్​ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనఫై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల మృతిపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

Read Also : YS Sharmila : వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ షర్మిల డిమాండ్