Site icon HashtagU Telugu

Aadhaar – Ration Link : రేషన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసుకునే గడువు పెంపు

Ration Cards update 2025

Aadhaar – Ration Link : రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా ? ఒకవేళ చేసుకోకుంటే టెన్షన్ పడొద్దు. ఎందుకంటే.. ఈ రెండింటిని లింక్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 30తోనే ముగియాల్సి ఉంది. అయితే ఇప్పటికీ కోట్లాది మంది దేశ ప్రజలు రేషన్ – ఆధార్‌లను లింక్ చేసుకోలేదు. దీంతో ప్రజల సౌకర్యార్ధం దీనికి సంబంధించిన గడువును పెంచారు.

We’re now on WhatsApp. Click to Join

రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల అర్హులైన వారికే ఆహార ధాన్యాలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  ఈ ప్రక్రియ వల్ల చనిపోయిన వారి పేర్లు కార్డుల నుంచి తొలగిపోతాయి. మొత్తం మీద తగిన అర్హతలు ఉన్న వారికే రేషన్  సరుకులు వెళ్తాయి. రేషన్ – ఆధార్‌లను సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా లింక్  చేసుకోవచ్చు.ఇందుకోసం మీ దగ్గరున్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులను తీసుకెళ్లాలి. బయోమెట్రిక్  వెరిఫికేషన్‌ చేసి ఈ రెండింటిని లింక్ చేస్తారు. ఈ క్రమంలో ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే దీన్ని పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్లకు అన్నింటికీ అనుసంధానం(Aadhaar – Ration Link) చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది.

Also Read : Global Peace Summit : ప్రపంచ శాంతి సదస్సుకు భారత్.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ఆపడమే లక్ష్యం

రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ, పింఛన్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర ప్రభుత్వ పథకాలు ముడిపడి ఉన్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని త్వరలో ప్రారంభించాలని డిసైడ్ చేశారు. మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే  సామాన్యులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

Also Read : Toothpaste Side Effects: ఓ మై గాడ్.. మనం వాడే టూత్‌పేస్ట్ వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉందా..!