Telangana Traffic Challans: సమయం లేదు మిత్రమా…చలాన్లు క్లియర్ చేసుకోండి..!!

  • Written By:
  • Updated On - March 30, 2022 / 09:43 AM IST

తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు రాయితీ మరో రెండు రోజులు మాత్రమే ఉంది. రాయితీతో చలాన్ల క్లియరెన్స్ మార్చి 1న మొదలు కాగా…మరో రెండు రోజుల్లో ముగియనుంది. అంటే మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. ఈ గడువును మరింత కాలం పొడగించే అవకాశం లేదని ఇప్పటికే తెలంగాణ పోలీసుల శాఖ తెలిపింది. గడువు దాటినా ఇంకా పెండింగ్ లోనే చలాన్లు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం నాడు పోలీసు శాఖ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.

ఇక రాయితీతో కూడిన పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీగానే స్పందన లభించింది. మంగళవారం నాటికి 2.50లక్షల పెండింగ్ చలాన్ లను వాహనదారులు క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 800 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు పోలీసు శాఖ చెప్పింది. చలాన్ల క్లియరెన్స్ తో రూ. 240కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లుగా పోలీసు శాఖ తెలిపింది. ఇప్పటికీ కూడా చలాన్లు క్లియర్ చేయనివారు ఉంటే మిగిలిన 2 రోజుల్లో క్లియర్ చేసుకోవాలని పోలీసు శాఖ సూచించింది.

ఈ రాయితీతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని గత నెల ప్రకటన విడుదల చేసింది తెలంగాణ పోలీసు శాఖ. బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. 75 శాతం చలాన్ డబ్బులను రద్దు చేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ 50 శాతం కాగా..ఆర్టిసి బస్సులకు 70శాతం, తోపుడు బండ్లకు 80శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిదే.

రాయితీతో పెండింగ్ ‌చలాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోవాలంటూ గ‌త నెల ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన తెలంగాణ పోలీసు శాఖ బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్‌ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపిన సంగ‌తి తెలిసిందే.