Site icon HashtagU Telugu

Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ బాడీ..

Hyd Deadbody

Hyd Deadbody

నిత్యం రద్దీ గా ఉండే..బంజారాహిల్స్ (Banjara Hills) తాజ్ కృష్ణ ఏరియాలో.. నడి రోడ్డుపై ట్రాఫిక్ బూత్ బాక్స్ (Traffic Box) లో డెడ్ బాడీ (Dead Body) ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ట్రాఫిక్ బూత్ బాక్స్ లో నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఉంటూ..ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుంటారు. అలాంటి బూత్ లో డెడ్ బాడీ ఉండడం ఏంటి అని పోలీసులు సైతం షాక్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ కృష్ణ హోటల్ ముందున్న ట్రఫిక్ బూత్ లో స్థానికులకు రక్తం కనిపించింది. ఏంటా అని చూడగా.. రక్తపు డుగులో ఉన్న ఓ డెడ్ బాడీ కానించేసరికి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు డెడ్ బాడీ ఉన్న ప్రదేశానికి చేరుకుని పరీక్షించారు. బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని హత్య ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య చేయడం ఏంటి..? హత్య చేసి ఇక్కడ పడేశారా..? లేక ఇక్కడే హత్య చేసి ఉంటారా అనే కోణంలో అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : AP : నిధులు ఇవ్వకుండా నియోజకవర్గం డెవలప్ చేయమంటే ఎలా..? – జగన్ ఫై జయరాం ఫైర్