Site icon HashtagU Telugu

Hyderabad: డీసీఎం ఢీ కొట్టడంతో కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం

Van Accident

Van Accident

Hyderabad: సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో గురువారం సాయంత్రం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది . అల్వాల్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చుట్టూ ప్రక్కల సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో చనిపోయిన తిరుపాల్..అల్వాల్‌ గంగపుత్ర కాలనీకి చెందివాడుగా గుర్తించారు. కృష్ణవేణి స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో కలిసి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. కుమారుడి మృతి ఘటన వింటే ఆ తండ్రి పరిస్థితి వర్ణనాతీతం.

Also Read: Bhaang Pakodi: ఎప్పుడైనా బాంగ్ పకోడీ తిన్నారా.. తినకపోతే ట్రై చేయండిలా?