తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు (21 Days Celebrations) గ్రాండ్ గా నిర్వహిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. జూన్ 2 నుంచి 21వ తేదీ వరకు ఏయే రోజు.. ఏయే అంశంపై ప్రోగ్రామ్స్ (21 Days Celebrations) ఉంటాయనేది వెల్లడించింది. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడంతో పాటు సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆ రోజు అదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రులు ఉత్సవాలను ప్రారంభిస్తారు.
Also Read : CM KCR: సర్పంచులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పంచాయతీలకు రూ.1190 కోట్లు!
జూన్ 3న రైతు దినోత్సవం, జూన్ 4న సురక్షా దినోత్సవం..
జూన్ 3న రైతు దినోత్సవం, జూన్ 4న సురక్షా దినోత్సవం, జూన్ 5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, జూన్ 7న సాగునీటి దినోత్సవం, జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ, జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, జూన్ 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు.
Also Read : KCR: కర్ణాటక స్టోరీపై కేసీఆర్ తెలంగాణ స్క్రీన్ ప్లే
22న అమరుల సంస్మరణ..
16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచి నీళ్ల పండగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న తెలంగాణ విద్యా దినోత్సవం, 21న తెలంగాణ ఆధ్మాత్మిక దినోత్సవం, 22న అమరుల సంస్మరణ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన అమరుల స్మారకాన్నిజూన్ 22న కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.