Data war : కేంద్రంపై ప్రాంతీయ అస్త్రం! నిర్మ‌ల‌మ్మ‌పై కేటీఆర్, క‌విత తిరుగుబాటు!

మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత ఆర్థిక‌శాఖ మంత్రి  సీతారామ‌న్ ను(Data War) టార్గెట్ చేశారు.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 02:34 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత ఒకేసారి కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి  సీతారామ‌న్ ను(Data War) టార్గెట్ చేశారు. బ‌డ్జెట్ లో కేటాయింపులు, హామీల గురించి ప్ర‌స్తావిస్తూ తెలంగాణ‌కు(Telangana) జ‌రిగిన అన్యాయంపై దాడికి దిగారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో తెలంగాణ కు చేసిన స‌హాయం గురించి నిర్మ‌ల చెబుతుంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల వాటాను క‌విత బ‌య‌ట‌కు తీశారు. చేత‌గాని ప‌రిపాల‌న కార‌ణంగా తెలంగాణ సుమారు రూ. 3ల‌క్ష‌ల కోట్లు అప్పు అయింద‌ని నిర్మ‌ల రాజ‌కీయ దాడికి దిగారు. రాష్ట్రం నుంచి వెళ్లిన ప‌న్నుల్లో స‌గం కూడా బ‌డ్జెట్లో కేటాయింపులు తెలంగాణ‌కు లేవ‌ని క‌విత ఎదురుదాడికి దిగ‌డంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన ప‌ర‌స్ప‌ర వాదప్ర‌తివాద‌న‌ల గురించి రెండు రోజులుగా మీడియాలో చ‌ర్చ‌నీయాంశం అయింది.

తెలంగాణ‌కు  జ‌రిగిన అన్యాయంపై సీతారామ‌న్  టార్గెట్ (Data War)

తాజాగా మంత్రి కేటీఆర్ అంత‌ర్జాతీయ డేటా రాయ‌బార కార్యాల‌యాల(Data War) గురించి ప్ర‌స్తావిస్తూ వాటిని గుజ‌రాత్‌కు ఎలా త‌ర‌లిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఆ రాష్ట్రం కంటే భూకంప తీవ్ర‌త జోన్లో మెరుగ్గా ఉన్న తెలంగాణ(Telangana) రాష్ట్రానికి ఆ ఆఫీస్ ల‌ను పెడితే ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో అంత‌ర్జాతీయ డేటా సెంట‌ర్ల ఆఫీస్ లు ఉంచడం వల్ల కలిగే ప్రమాదాలను ఫ్లాగ్ చేస్తూ తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా రాయబార కార్యాలయాలను..

గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా రాయబార కార్యాలయాలను(Data War) ఏర్పాటు చేయాల‌ని బడ్జెట్ లో చేసి ప్రతిపాదనపై అభ్యంతరాలను కేటీఆర్ లేవనెత్తారు.భూకంపాలు ఎక్కువగా సంభవించే గుజరాత్ రాష్ట్రంలో ఒకే చోట వాటిని ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఇత‌ర దేశానికి రాష్ట్ర సరిహద్దు కారణంగా భద్రతా ముప్పును ఉంటుంద‌ని ప్ర‌స్తావించారు. అందుకే, హైదరాబాద్ కు డేటా రాయబార కార్యాలయాలను త‌ర‌లించాల‌ని సూచించారు. అంతేకాదు, క్లయింట్ దేశాల ప్రయోజనాలను కూడా పరిగణన‌లోకి తీసుకుని స్థ‌లాల‌ను ఎంపిక చేయాల‌ని కోరారు. అంటే వాళ్ల ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా గుజ‌రాత్ కు ఆఫీస్ ల‌ను మ‌ళ్లించార‌ని ప‌రోక్షంగా చుర‌క‌లు వేశారు.

గుజ‌రాత్ లోని గిఫ్ట్ సిటీ సీస్మిక్ జోన్-3లో

హైదరాబాద్ సీస్మిక్ జోన్-IIలో ఉంది.భారతదేశంలో అతి తక్కువ ప్ర‌భావం ఉన్న‌ భూకంప జోన్‌లలో ఒకటి. అందుకే, హైద‌రాబాద్‌(Telangana) డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, గుజ‌రాత్ లోని గిఫ్ట్ సిటీ సీస్మిక్ జోన్-IIIలో ఉంది. అంతేకాదు, సీస్మిక్ జోన్-IVకి చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి ప్రాంతం భూకంపాలకు ఎక్కువ గుర‌వుతుంది. అలాంటి చోట‌ అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను అభివృద్ధి చేయడం ప్రమాదాలకు కార‌ణం అయ్యే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా అంతర్జాతీయ సంబంధాలపై గణనీయమైన పరిణామాలను కలిగిస్తుంద‌ని లేఖ‌లో కేటీఆర్ పొందుప‌రిచారు.

డేటా రాయబార కార్యాలయాలకు కేటీఆర్ లేఖ‌ (Telangana)

గ్లోబల్ డేటా సెంటర్ మేజర్లు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణను(Telangana) ఎంచుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి మైక్రోసాఫ్ట్ అజూర్ వరకు హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రం ఇప్పుడు అనేక హైపర్-స్కేల్ మరియు ఎడ్జ్ డేటా సెంటర్‌లకు నిలయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో డేటా సెంటర్ పాలసీని ప్రారంభించిందని, సెంట‌ర్ల ఏర్పాటుకు సులభతరం చేయడానికి అనేక ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ఆమోద నిబంధనలను అందించిందని రామారావు వివ‌రించారు. డ్యూయల్ పవర్ గ్రిడ్‌లకు యాక్సెస్, తక్కువ-ధర విద్యుత్ సరఫరా మరియు హై-స్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్ మొదలైన అంశాలు డేటా సెంటర్‌లకు (Data War) అనుకూలం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల అనుభవం చాలా సానుకూలంగా ఉంది. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలకు ఇదే విధమైన సహకారం అందించడం కోసం రాష్ట్రం సిద్దంగా ఉంద‌ని నిర్మ‌ల‌కు రాసిన లేఖ‌లో కేటీఆర్ వివ‌రించారు.

Also Read : KTR Review: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై కేటీఆర్ రివ్యూ!

బడ్జెట్ ప్రతిపాదనను సవరించాలని ఆర్థిక మంత్రి నిర్మ‌ల‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రాల మధ్య డేటా మౌలిక సదుపాయాల కోసం ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్‌ను కూడా అందిస్తామని చెప్పారు. ఇప్ప‌టికే బ‌డ్జెట్ కేటాయింపుల‌పై గ‌ళ‌మెత్త‌న క‌విత‌కు తోడుగా ఇప్పుడు కేటీఆర్ కూడా ఆర్థిక మంత్రి నిర్మ‌ల మీద అంత‌ర్జాతీయ డేటా సెంట‌ర్ల (Data War) కోసం పోరాటం మొద‌లు పెట్టారు. సానుకూలంగా కేంద్రం స్పందించ‌క‌పోతే , రాబోవు రోజుల్లో ఈ అంశాల‌ను రాజ‌కీయ ఎజెండాగా తీసుకుని ఎన్నిక‌ల అస్త్రాలుగా మ‌లుచుకుంటార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : KCR Kondagattu: దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు: కేసీఆర్