Telangana: ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం.. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు..!

Telangana: తెలంగాణ ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌స‌రా సెల‌వుల్లో క్లాసులు నిర్వ‌హించే జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌కు భారీ షాక్ ఇవ్వ‌టానికి రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు సిద్ధ‌మైంది. ద‌స‌రా సెలవుల్లో జూనియ‌ర్ క‌ళాశాల‌లు క్లాసులు నిర్వ‌హిస్తే వాటి గుర్తింపు ర‌ద్దు

  • Written By:
  • Updated On - October 1, 2022 / 11:39 PM IST

Telangana: తెలంగాణ ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌స‌రా సెల‌వుల్లో క్లాసులు నిర్వ‌హించే జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌కు భారీ షాక్ ఇవ్వ‌టానికి రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు సిద్ధ‌మైంది. ద‌స‌రా సెలవుల్లో జూనియ‌ర్ క‌ళాశాల‌లు క్లాసులు నిర్వ‌హిస్తే వాటి గుర్తింపు ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బోర్డు హెచ్చ‌రించింది. క్లాసులు నిర్వ‌హించే క‌ళాశాల‌ల మేనేజ్‌మెంట్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్స్‌పై కూడా తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

సెలవుల్లో కూడా విద్యార్థుల‌ను క్లాసుల పేరుతో వేధిస్తోన్నార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఇంట‌ర్ బోర్డ‌కు కొన్ని ఫిర్యాదులు అందిన‌ట్లు స‌మాచారం. అయితే.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ జూనియ‌ర్ క‌ళాశాల‌ల‌కు ఈనెల 2 నుంచి 9వ‌ర‌కు సెల‌వులు ఉంటాయ‌ని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాలేజీలు ఈనెల 10న తిరిగి ప్రారంభమవుతాయని ఇంట‌ర్ బోర్డు అధికారులు తెలిపారు. సెలవుల్లో కూడా క‌ళాశాల‌లు నిర్వ‌హిస్తే మాత్రం తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బోర్డు అధికారులు హెచ్చ‌రించారు.