Dark Politics : తెలంగాణ `ఫిక్సింగ్` రాజ‌కీయం

తెలంగాణ రాజ‌కీయాల్లో అతిపెద్ద అనుమానం ఏ పార్టీ దేనితో క‌లిసి చీక‌టి ఒప్పందం(Dark Politics)  కుదుర్చుకుంది? అనే దానికి స‌మాధానం

  • Written By:
  • Updated On - May 20, 2023 / 05:27 PM IST

తెలంగాణ రాజ‌కీయాల్లో అతిపెద్ద అనుమానం ఏ పార్టీ దేనితో క‌లిసి చీక‌టి ఒప్పందం(Dark Politics)  కుదుర్చుకుంది? అనేది. దానికి స‌మాధానం త‌ల‌పండిన మీడియా పెద్ద‌ల‌కు కూడా అర్థంకాని విధంగా హైడ్రామా పొలిటిక‌ల్ పార్టీల మ‌ధ్య న‌డుస్తోంది. జాతీయ స్థాయిలో ఎద‌గాల‌ని క‌ల‌కంటోన్న కేసీఆర్(KCR) తాజాగా జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఇంత‌కంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ లేద‌ని కాంగ్రెస్ చెబుతోంది.

జాతీయ స్థాయిలో క‌ల‌కంటోన్న కేసీఆర్ (Dark Politics)

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన దానిప్ర‌కారం జేడీఎస్ (JDS)తో క‌లిసి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాలి. కానీ, అటు వైపు కేసీఆర్ చూడ‌లేదు. అంత‌కుముందు, క‌ర్ణాట‌క వెళ్లిన ఆయ‌న మాజీ సీఎం కుమారస్వామి ఆతిథ్యాన్ని తీసుకున్నారు. ప్ర‌తిగా కుమార‌స్వామి కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం రోజు తెలంగాణ భ‌వ‌న్లో క‌నిపించారు. అన్న‌ద‌మ్ముల మాదిరిగా క‌లిసిమెలిసి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. టార్గెట్ 100 దిశ‌గా వెళుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప‌లు రాష్ట్రాల్లో పోటీచేసి జాతీయ‌స్థాయి గుర్తింపు. బీఆర్ఎస్ కు తెస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల‌కు పెట్టుబడి పెట్ట‌డం ద్వారా ఢిల్లీ పీఠం ఆందుకోవాల‌నే వ్యూహాన్ని జాతీయ ఛాన‌ల్ విలేక‌రితో పంచుకున్నార‌ని కూడా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో ఎక్క‌డా కేసీఆర్ (Dark Politics) ఆన‌వాళ్లు క‌నిపించ‌లేదు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో ఎక్క‌డా కేసీఆర్ ఆన‌వాళ్లు

స‌రిహ‌ద్దులోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపించ‌డానికి కూడా సాహ‌సం కేసీఆర్ (KCR) చేయ‌లేదు. బీజేపీకి తెర‌వెనుక స‌హ‌కారం అందించార‌ని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణాలోనూ ఆ రెండు పార్టీలు ఒక‌టేన‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఘ‌ట్టాల‌ను కూడా గుర్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పార్ల‌మెంట్ లోప‌ల, బ‌య‌ట బీజేపీకి మ‌ద్ధ‌తు కేసీఆర్ ప‌లికారు. కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయంగా తెలంగాణ‌లో ఎదుగుతోన్న టైంలో బీజేపీ మీద కేసీఆర్ రివ‌ర్స్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ అవార్డులు, రివార్డులు కేంద్రం నుంచి కేసీఆర్ స‌ర్కార్ అందుకుంటూనే ఉంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్లో స‌మ‌ర్థించిన కేసీఆర్ ఆ త‌రువాత వ్య‌తిరేకిస్తూ రాష్ట్ర‌మంత‌టా రాద్ధాంతం చేశారు. ప్ర‌తిగా బీజేపీ కూడా రంగంలోకి దిగడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం అనే దిశ‌గా రాజ‌కీయాన్ని (Dark Politics )ర‌క్తిక‌ట్టించారు.

క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం బీజేపీకి రాజ‌కీయ న‌ష్ట‌మ‌ని (Dark Politics)

క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఎన్నిక‌లు జరుగుతోన్న వేళ మ‌హారాష్ట్రలో కేసీఆర్ (KCR)మీటింగ్ లు పెడుతూ కాలం గ‌డిపారు. ఫ‌లితాల త‌రువాత కర్ణాట‌క వేరు, తెలంగాణ వేరంటూ ఫ‌లితాల‌ను పోల్చ‌లేమ‌ని నైస్ గా విశ్లేష‌ణ చేయ‌డం విచిత్రం. అంటే, బీజేపీ పెద్ద‌ల‌కు భ‌య‌ప‌డుతూ వాళ్ల అడుగుల‌కు మడుగులొత్తుతున్నార‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఢిల్లీ సౌత్ గ్రూప్ నుంచి మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌ని ఈడీ తొలుత భావించింది. అంతేకాదు, కొన్ని ఆధారాల‌తో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను విచార‌ణ చేసి కవిత ప్రమేయం ఉంద‌ని చార్జిషీట్ లో పొందుప‌రిచింది. కానీ, ఏమైయిదోగానీ ఆమెను అరెస్ట్ చేయ‌కుండా ఈడీ వ‌దిలేసింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక‌టే అనే సంకేతం బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లింది. ఆ విష‌యాన్ని బీజేపీ లీడ‌ర్ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి చెబుతూ క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం బీజేపీకి తెలంగాణ‌లో పెద్ద రాజ‌కీయ న‌ష్ట‌మ‌ని భావించారు. ఆ రెండు పార్టీల మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ (Dark Politics) ఉంద‌ని కొండా వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్టం అవుతోంది.

Also Read : BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు

గ‌త ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేస్తామ‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్(Bandi sanjay) తో పాటు అమిత్ షా కూడా వెల్ల‌డించారు. నిజ‌మేన‌ని గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌తో పాటు హూజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓట్లు వేశారు. కానీ, వాళ్లు చెప్పిన అరెస్ట్ లు అబ‌ద్ధ‌మ‌ని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌ను వ‌దిలేయ‌డం నిరూపించింది. విచార‌ణ‌ల‌న్నీ డ్రామాలంటూ కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. ప్ర‌తిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక‌టేనంటూ బీజేపీ ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఆ విష‌యాన్ని తొలుత అమిత్ షా ప్ర‌చారంలోకి తీసుకురాగా, దాన్ని బీజేపీ లీడ‌ర్లు అందుకున్నారు. అందుకు బ‌లం చేకూరేలా రాహుల్ గాంధీ పుట్టుక‌పై బీజేపీ లీడ‌ర్లు కొంద‌రు చేసిన కామెంట్ల‌ను కేసీఆర్ ఖండించారు. ఇటీవ‌ల రాహుల్ ను (Rahul Gandhi) ఎంపీ ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చారు. ఇంకేముంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు (Dark Politics)అంటూ బ‌ల‌మైన ప్ర‌చారం జ‌రిగింది. దానికి బ‌లంచేకూరేలా ఉంటుంద‌ని క‌ర్ణాట‌క సీఎంగా సిద్ది రామ‌య్య ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానాన్ని కేసీఆర్ కు పంపించ‌లేదు.

Also Read : KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ

భావ‌సారూప్య‌త ఉన్న దేశంలోని అన్నీ పార్టీల‌కు ఆహ్వానాల‌ను కాంగ్రెస్ పార్టీ పంపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏ పార్టీకి క‌ర్ణాట‌క సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి ఇన్విటేష‌న్ ఇవ్వ‌లేదు. బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడే పార్టీల అధినేత‌ల‌కు మాత్ర‌మే ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు పేర్లు లేవు. అంటే, బీజేపీతో క‌లిసి వాళ్లు ప‌నిచేస్తున్నార‌ని కాంగ్రెస్ విశ్వ‌సిస్తోంది. కానీ, కేసీఆర్ కోట‌రీ మాత్రం కాంగ్రెస్ ఆహ్వానం పంపినప్పటికీ తిర‌స్క‌రించామ‌ని(Dark Politics) ప్ర‌చారం చేసింది. అదంతా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర‌లో భాగ‌మ‌ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. కేసీఆర్ తో ఎలాంటి పొత్తు ఉండ‌ద‌ని టీ కాంగ్రెస్ వాదులు చెప్ప‌డాన్ని గ‌మ‌నిస్తే తెలంగాణ రాజ‌కీయ పార్టీల ముసుగు ఎప్పుడు తొలుగుతుంది? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కావ‌డం స‌హ‌జం