Site icon HashtagU Telugu

Danam Nagender : హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Danam Hydraa

Danam Hydraa

హైదరాబాద్ (Hydrabad) లో హైడ్రా (Hydraa) దూకుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. మొదట ప్రభుత్వ స్థలాలు , చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని కూలుస్తామని తెలిపింది..ఆ తర్వాత నూతనంగా కట్టే నిర్మాణాలు మాత్రమే కూలుస్తామని..నివాసం ఉండే నిర్మాణాల జోలికి వెళ్ళమని చెప్పింది..కానీ చేసేది మాత్రం అన్నింటికి రివర్స్. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న..పక్క రిజిస్టేషన్ ఉన్న ఇళ్లను సైతం కూల్చేస్తు వస్తుంది. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీరు కు నిరసనగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇదే సందర్బంగా రేవంత్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ తిట్ల దండకం చేస్తున్నారు. హైడ్రా తీరుపై విపలక్షలే కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తప్పు పడుతున్నారు. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయం ఏమాత్రం సరికాదని మాట్లాడుకుంటూ వచ్చిన వారు..ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి హైడ్రా ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ..హైడ్రా ఫై మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. స్లమ్‌ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్‌లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. ముసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇళ్లకు రెడ్‌మార్క్ వేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాను” అంటూ దానం తెలిపారు.

Read Also : Apples – Drugs : యాపిల్స్ మాటున డ్రగ్స్ దందా.. అడ్డంగా దొరికిపోయిన వ్యాపారి