Site icon HashtagU Telugu

Telangana Assembly : ‘నీ అమ్మ ముసుకో’ అసెంబ్లీ లో దానం బూతు పురాణం

Danam Ass

Danam Ass

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు చివరి రోజు ఈరోజు కూడా వాడివేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender Unparliamentary Language in assembly) తీవ్ర వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఏయ్ నోర్ముయ్ .. ‘నీ అమ్మ ముసుకో’ అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు అసెంబ్లీ లో ఉద్రిక్త పరిస్థితి చెలరేగింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు జోక్యం చేసుకుని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో స్పీకర్ సూచనల మేరకు దానం నాగేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి, విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని, తాను సీనియర్ నని, తన గురించి అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ..గత పదేళ్ల కాలంలో నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని, తాము అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని , వివిధ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చామని , అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదా వేశామని పేర్కొన్నారు.

Read Also :