తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిసాయి. గందరగోళం నడుమ అసెంబ్లీని స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. అయితే.. 9 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా వాదనలు జరిగాయి. కొన్ని సార్లు ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. నిన్న దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ నేతల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసనలు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. ఇదిలా ఉంటే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తన ప్రవర్తనతో మళ్లీ వార్తల్లో నిలిచారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల గురించి దానం నాగేందర్ మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి సభలో ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ దానం నాగేందర్‌కు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జాబ్ క్యాలెండర్ గురించి దానం నాగేందర్ మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. దీంతో విసుగు చెందిన దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్న అందరినీ షాక్‌కు గురి చేశాడని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అఫ్ కోర్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్ పార్లమెంటరీ మాటలతో దానం నాగేందర్‌ను రెచ్చగొట్టారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రసంగిస్తుండగా కౌశిక్ రెడ్డి అభ్యంతరకర పదజాలం వాడారు. దీనిపై స్పందించిన దానం నాగేందర్ అతడిని హెచ్చరించి అదే రీతిలో బదులిచ్చాడు. దానం ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు.
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దానం నాగేందర్ పోలీసు బలగాలతో టీఆర్‌ఎస్ కేడర్‌ను, ప్రజలను నియంత్రించారు. వరసగా ఎన్నికైనప్పటికీ దానం నాగేందర్ వైఖరి రాజకీయంగా కాంగ్రెస్‌కు ప్రయోజనం కలిగించలేదు.
Read Also : Amazon Great Freedom Sale: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్.. వీటిపై భారీగా ఆఫర్‌లు..!