Site icon HashtagU Telugu

Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం

IPL Black Tickets

Danam Brs

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ నుండి విజయం సాధించిన దానం నాగేందర్ (Danam Nagender)..తాజాగా కాంగ్రెస్ పార్టీ (COngress) లో చేరి..ఇప్పుడు ఎంపీ బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో దానం ఫై బిఆర్ఎస్ (BRS) నేతలు చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని .. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని .. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ లోపించింది కాబట్టే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. అలాగే బీజేపీతో కలుస్తున్నామని కేటీఆర్ తనతో అన్నారు.. అది నాకు నచ్చలేదని చెప్పాను. బీజేపీతో కలవడం ఏంటని కూడా ప్రశ్నించాను. కానీ, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నేను పార్టీ వీడటానికి అదొక కారణం’ అని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అనుకున్నానని అన్నారు. అసలు పార్టీల ఫిరాయింలపుకు ముందు తెరలేపింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. కేసీఆర్ గొప్ప నాయకుడు, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని , రాజకీయంగా అవకాశాలు కల్పించిన కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని తన అభిమానాన్ని చాటుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.అయితే ఈ రోజు హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. తన స్వార్థం కోసం దానం నాగేందర్ పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి భిన్నంగా స్పందించారు. అనర్హత వేటు వేయాలని బీ ఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అడగకుండా ఓటు వేసిన మీరెందుకు అడుగుతున్నారని పిటిషన్ వేసిన రాజు యాదవ్‌ను ప్రశ్నించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం ఉండాలి కానీ ఓటర్‌గా ఉండి మీరు పిటిషన్ వెయ్యడమేంటన్న హైకోర్టు ప్రశ్నించింది. అనర్హత వేయాలని తాము అసెంబ్లీ స్పీకర్‌కు ఎలాంటి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

Read Also : Eye Care: సమ్మర్ లో కళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?

Exit mobile version