Damodar Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దామోదర్‌ రాజనర్సింహ

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:15 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా విజయం సాధించిన దామోదర్‌ రాజనర్సింహ..తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. దామోదర్‌ రాజనర్సింహ..1989లో ఆయన తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ అకాల మరణం చెందడంతో, రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1989లో జరిగిన అందోలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఓటమి చెందినా, నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు.

ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమైన ఆయన 2004 ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పి.బాబూమోహన్‌పై భారీ మేజారీటీతో దామోదర్‌ గెలుపొందారు. 2006లో వైఎస్‌ఆర్‌ పాలనలో మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందిన దామోదర్‌ వైఎస్‌ఆర్, రోశయ్య హయాంలోని మంత్రి వర్గంలో పనిచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

2010లో అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణకు ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవీని ఇవ్వాల్సిన సందర్భం రావడంతో 2011 జూన్‌ 10వ తేదీన డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందగా, ఆగస్టు 20, 2023న జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి క్రాంతికిరణ్‌పై విజయాన్ని సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read Also : Jupally Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు