Saroornagar: ముస్లిం, ద‌ళిత `ప్రేమ‌లోకం`లో హ‌త్య‌

ఓ ముస్లిం యువ‌తి, ద‌ళిత యువ‌కుని ప్రేమ పెళ్లి విషాదానికి దారితీసింది. ప్రేమ జంట‌పై ముస్లిం యువ‌కులు హైద‌రాబాద్ న‌డిబొడ్డున క‌ర్క‌శ‌కంగా దాడికి దిగారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 03:29 PM IST

ఓ ముస్లిం యువ‌తి, ద‌ళిత యువ‌కుని ప్రేమ పెళ్లి విషాదానికి దారితీసింది. ప్రేమ జంట‌పై ముస్లిం యువ‌కులు హైద‌రాబాద్ న‌డిబొడ్డున క‌ర్క‌శ‌కంగా దాడికి దిగారు. ముస్లిం యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాల సామాజిక‌వ‌ర్గంకు చెందిన నాగ‌రాజును హ‌త్య చేశారు. ఈ సంఘ‌ట‌న ముస్లిం, ద‌ళితుల మ‌ధ్య ఒక వివాదంగా మారింది. ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాల‌ను ప‌రిశీలిస్తే, మ‌తాంత‌ర వివాహం చేసుకున్న కార‌ణంగా ఈ హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్లో ద‌ళితుడైన 26ఏళ్ల బిల్లిపురం నాగరాజు , ప్రేమికురాలు ఆశ్రిన్ తో ఉంటున్నాడు. నాగరాజు స్వస్థలం రంగారెడ్డి జిల్లా మర్పల్లె కాగా, అశ్రిన్ అదే జిల్లాలోని పొరుగున ఉన్న ఘనాపూర్ గ్రామం. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవ‌డానికి అష్రిన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమ‌జంట ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్ వేడుకలో వివాహం చేసుకున్నారు.

వివాహానంతరం దంపతులు సరూర్‌నగర్‌లోని పంజాల అనిల్‌కుమార్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. నాగరాజు కార్‌ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకున్న త‌రువాత అశ్రిన్ కుటుంబ సభ్యులు అనుసరిస్తున్నారని అనుమానించారు. దీంతో కొంత కాలం దంపతులు విశాఖపట్నంకు మారారని నివేదికలు చెబుతున్నాయి. ఐదు రోజుల క్రితమే నగరానికి తిరిగి వ‌చ్చిన త‌రువాత ఇక ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని అనుకున్నారు. ప్రేమికులు ఇద్ద‌రూ ఈనెల 4తేదీన రాత్రి 9 గంటల సమయంలో హైద‌రాబాద్ లోని స‌రూర్ న‌గ‌ర్ ప్రాంతంలో ద్విచ‌క్ర‌ వాహనంపై వెళుతున్నారు. ఆక‌స్మాత్తుగా ఆశ్రిన్ సోదరుడు, మరొక బంధువు బైక్‌పై వెంబడించారు. ఆ తర్వాత ప్రేమికుల‌ను అడ్డుకుని నాగ‌రాజు తలపై ఇనుప రాడ్‌తో కొట్టి, కత్తితో దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా అగంత‌కులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ దెబ్బలకు నాగరాజు వెంటనే ప్రాణాలు విడిచాడు. ఈ దాడి వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులు చెబుతుండగా, ఐదుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడి భార్య సయ్యద్ అష్రిన్ సుల్తానా తెలిపారు.

తాము 10వ తరగతి నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, నాగరాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించినప్పటికీ తిరస్కరించారని అష్రిన్ మీడియాకు తెలిపారు. “అతను ఇస్లాం మతంలోకి మారతానని మా అమ్మతో కూడా చెప్పాడు, అయినప్పటికీ వారు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు” అని అష్రిన్ చెప్పారు. ఎల్‌బి నగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “మహిళ సోదరుడు మరియు ఆమె బంధువు దంపతుల నివాసాన్ని కనుగొన్నారు. బాధితురాలిపై ఇనుప రోడ్డు, కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మేము తదుపరి విచారణను నిర్వహిస్తున్నాము. ” పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. అతను వేరే మతానికి చెందినవాడు కాబట్టి హ‌త్య జ‌రిగింద‌ని .సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె సీతారాం ప్రాథ‌మికంగా అనుమానిస్తున్నారు. కాగా, బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు గుమిగూడి జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.