D Srinvias: : విషమంగా డీఎస్ ఆరోగ్యం..

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు

  • Written By:
  • Publish Date - June 2, 2024 / 10:41 AM IST

పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) (D Srinvias)ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు.

తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా డిఎస్ అభిమానులను, అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసియులో ఉండగా ఆరోగ్య విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన డీఎస్ ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత డీఎస్‌ను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలుమార్లు డీఎస్ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడడం.. సెప్టిక్‌ షాక్‌తో పలు అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో హాస్పటల్ లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీఎస్ ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఇంటికి తీసుకరావడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

డీఎస్ రాజకీయ ప్రస్థానం చూస్తే..

1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందాడు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ను ఓడించి రెండవసారి శాసనసభ కు గెలుపొందాడు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి నియమించబడ్డాడు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికై వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు.

2009 ఎన్నికలలో నిజామాబాదు నుంచే పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందాడు. తెలంగాణా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయాడు. 2014లో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయాడు.

2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ధర్మపురి శ్రీనివాస్ 2023 మార్చి 26న కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also : UPI Transactions: కొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్న యూపీఐ లావాదేవీలు.. మే నెల‌లో ఎంతంటే..?