Site icon HashtagU Telugu

D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!

Ds

Ds

D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డి శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సెన్సోరియమ్‌లో మార్పు రావడంతో శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. అవయవాలు కూడా పనిచేయకపోవటంతో సెప్టిక్ షాక్‌తో బాధపడుతున్నాడు.

ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.  శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయ్యారు. సీనియర్ నాయకుడు (D Srinivas) ఇటీవలే BRS నుండి వైదొలిగి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

Also Read: CM YS Jagan: లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం జగన్

Exit mobile version