Site icon HashtagU Telugu

Trans Woman: ‘‘సమానత్వం.. మానవత్వం’’ ఈ ట్రాన్స్ జెండర్ లక్ష్యం!

Trans

Trans

ఓ ట్రాన్స్ జెండర్.. సొసైటీలో చిత్రహింసలకు గురైంది.. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. తనలాంటివాళ్లు వివక్షకు గురికాకూడదనే ఉద్దేశంతో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ పిల్లల్లో, మహిళల్లో అవేర్ నెస్ తీసుకొస్తోంది. 

అది డిసెంబర్ మిట్టమధ్యాహ్నం..  23 ఏళ్ల గాయత్రీ భగత్ సింగ్ నిజామాబాద్‌లోని ఆర్మూర్ పట్టణంలో సైకిల్ తొక్కుతోంది. అక్కడున్న పిల్లలకు, మహిళలకు సామాజికాంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. ఓ ట్రాన్స్ జెండర్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైక్లింగ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మానవత్వం, సామానత్వం, ప్రజాస్వామం లాంటి అంశాలపై ఉపన్యాసాలు ఇస్తోంది.

గాయత్రి స్వస్థలం కామారెడ్డి జిల్లా దోమకొండ. గాయత్రి పారిశ్రామిక శిక్షణా సంస్థలో టెక్నికల్ కోర్సు పూర్తి చేసినప్పటికీ, లింగమార్పిడి చేయించుకున్నవాళ్లను నియమించుకోవడానికి యజమానులు వెనుకాడటం వల్ల ఆమె 2017 నుండి నిరుద్యోగిగా ఉంది. “మహమ్మారి నా ఉపాధి అవకాశాలను మరింత ప్రభావితం చేసింది. బహుశా నన్ను సంతోషపరిచే పనిని చేయగలనని అనుకున్నాను. నేను సైకిల్ యాత్ర ఆలోచనతో వచ్చాను” మీడియాతో చెప్పింది. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యురాలిగా ఉన్న గాయత్రి డిసెంబర్ 4న హైదరాబాద్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా, ఆమె 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో పర్యటించి 400 మందికి పైగా పిల్లలను పలు అంశాలపై అవగాహన కల్పించింది.

‘‘ప్రజల్లో ప్రస్తుతం మానవత్వం, సమానత్వం ఎక్కడా కనిపించడం లేదు. పిల్లలు, యువ తరం, మానవులను సమానంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రాథమిక హక్కులకు ప్రతి ఒక్కరూ అర్హులని నేను పిల్లలకు నేర్పించాలనుకుంటున్నాను, ”అని గాయత్రి నొక్కి చెప్పారు. “ప్రజాస్వామ్యం అనేది నేను విద్యార్థులకు అవగాహన కల్పించే మరో అంశం. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్య హక్కుల గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. పిల్లలు పెద్దవాళ్లయ్యే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటోంది గాయత్రీ.

Exit mobile version