Fake Call Centres: క్రెడిట్ కార్డు కావాలా అంటూ, మూడు కోట్లు దోచుకున్నారు

ఆర్బీల్ బ్యాంకు కాల్ సెంటర్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - November 17, 2021 / 08:39 PM IST

ఆర్బీల్ బ్యాంకు కాల్ సెంటర్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిళ్ళీ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ గ్యాంగ్ ప్రజల నుండి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ స్కామ్ కోసం ఆర్బీఎల్ బాంక్ ఉద్యోగులు తమ కస్టమర్స్ డేటా ఇచ్చారని సమాచారం. క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ డేటాను తీసుకున్న ఫేక్ కాల్ సెంటర్ నిర్వాహకులు కస్టమర్ కి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ పిన్ జనరేషన్ ప్రాసెస్ అంటూ వారి మొబైల్ ఫోన్ కి వచ్చిన ఓటీపీ ని అడిగిమరి డబ్బును కాజేయడం ఈ గ్యాంగ్ పని. కస్టమర్ పేరు, అడ్రస్, డేట్ అఫ్ బర్,త్ ఫోన్ నెంబర్, క్రెడిట్ కార్డు నెంబర్ అన్ని చెప్పడంతో జనాలు కూడా ఈజీగా నమ్మి మోసపోయారు.

ఆన్లైన్ షాపింగ్ కోసం ఈ ముఠాలోని సభ్యులే సొంతంగా ఆరు మర్చంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి వాటికి సొంత బ్యాంక్ అకౌంట్ ని జతచేసి కస్టమర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆ వెబ్ సైట్ లో షాపింగ్ చేస్తూ డబ్బులు కొల్లగొట్టడం లాంటి టెక్నీక్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారట.

సైబరాబాద్ లిమిట్స్ లో వచ్చిన ఓ కంప్లైంట్ తో పోలీసులు ఈ కేసును ఛేదించారు. బ్యాంక్ రిప్రజెంటేటివ్ అంటూ కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డ్ వివరాలు తీసుకొని ఓటిపి సాయంతో 98000 దోచేయడంతో ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో
అసలు విషయం బయటపడింది.

ఈ స్కామ్లో మొత్తం 23 మంది ఇన్వాల్మెంట్ ఉండగా ఇప్పటికి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన సూత్రదారి మాత్రం పరారీలో ఉన్నాడట. ఈ ముఠాపై ఇప్పటికి తెలుగురాష్ట్రాల్లో 34 కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా నూట 166 కేసులు నమోదయ్యాయి.

పోలీసులు జరిపిన దాడుల్లో బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కార్లు, 825 ఫేక్ ఆధార్ ఓటర్ పాన్ కార్డులు, వెయ్యికిపైగా సిమ్ కార్డులు, 34 మొబైల్ ఫోన్స్, చెక్ బుక్స్, పాస్ బుక్స్, స్వైపింగ్ మిషిన్స్ దొరికాయట.

బ్యాంక్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఓటిపి డీటెయిల్స్ చెప్పకూడదని, సొంత పిన్ నెంబర్లను క్రియేట్ చేసుకోవాలని, రివార్డ్ పాయింట్స్, క్రెడిట్ లిమిట్ పెంపు, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలాంటి విషయాల్లో బ్యాంక్ సూచనలు పాటించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు సూచించారు.